కరీంనగర్

రైతుల కోసం రెవెన్యూ లోక్ అదాలత్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఏప్రిల్ 20: భూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో రెవెన్యూ ఆధ్వర్యంలో లోక్ అదాలత్‌లు నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమానికి గాను, రైతుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 80 శాతం రికార్డులు ఆన్‌లైన్ పూర్తయిందని, మిగతావి త్వరలో పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఆర్‌డిఓ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి ప్రతీ మండల కేంద్రంలో రెవెన్యూ లోక్ అదాలత్‌లు నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే రెవెన్యూ లోక్ అదాలత్‌లను జిల్లా మంత్రిచే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటికి ఇబ్బందులకు గురికాకుండా లక్షలాది రూపాయలను కేటాయిస్తుందని, అలాగే గ్రామాలలో ప్రజాప్రతినిధులు తాను తాగునీటి సమస్యలు ఏర్పడకుండా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కరువును ఎదుర్కొనేందుకు జిల్లా మంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావుల సహకారంతో ఒక్కో నియోజకవర్గానికి 60 నుండి 70 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు. రానున్న మే నెలలో మరిన్ని నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో కరువు లేకుండా చూడడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని అన్నారు. సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ ఎస్సీ మహిళ రిజర్వుడ్ అయినందున తన భార్య కాంపెల్లి వసంతకు అవకాశం కల్పించాలని కాంపెల్లి నారాయణ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డిలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు పారుపెల్లి వైకుంఠపతి, బాలాజీ రావు, ఎంపిటిసి సభ్యులు పల్లా సురేష్, సూర శ్యాం, సర్పంచ్ బోయిని రాజమల్లయ్య, కాంపెల్లి నారాయణ, పెద్దన్న, బుర్ర శ్రీనివాస్ గౌడ్, తిప్పారపు దయాకర్, ఆరెపల్లి జితేందర్, బండి సంపత్, కనె్న చంద్రయ్య, రాహుల్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు.