కరీంనగర్

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ: సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, మే 22: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పోలీస్ శాఖలో 18 వేల మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేసేందుకు ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించనున్నదని పేర్కొన్నారు. ఉచిత శిక్షణ శిబిరం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో ఉండాలని, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు హాజరై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం 167.67 మీటర్ల ఎత్తు కలిగి ఉండాలని తెలిపారు. ఉచిత శిక్షణ శిబిరానికి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బుధవారం నుండి దరఖాస్తులు స్వీకరించనున్నామని చెప్పారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (పరిపాలన) మల్లేశంలకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, కుల దృవీకరణ సర్ట్ఫికేట్లతో పాటు ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలతో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని చెప్పారు. జూన్ 3న రాత పరీక్ష నిర్వహించి శిక్షణ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

సాక్షరభారతీ కో-ఆర్డినేటర్ల రిలే దీక్షలు
గంభీరావుపేట, మే 22: సాక్షరభారతీని పునరుద్ధరించాలని కోరుతూ గంభీరావుపేట మండల సాక్షరభారతీ కో-ఆర్టీనేటర్లు నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారంతో రెండవ రోజుకు చేరుకున్నాయి. సాక్షరభారతీని పునరుద్ధరించి, పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసవేతన సదుపాయం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మండల సాక్షరభారతీ కో-ఆర్డీనేటర్ కూర అంజయ్యలతో పాటు సత్యం, మమతారెడ్డి, దేవమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాక్షరభారతీ రిలేదీక్షలకు కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఎగదండి స్వామి సంఘీభావం తెలిపారు.