కరీంనగర్

నిత్య సాధనతోనే ఉన్నత శిఖరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, మే 22: నిత్య శిక్షణతోనే క్రీడాకారులలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం బహిర్గతం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తారని, అంతర్జాతీయ ఖో-ఖో క్రీడాకారుడు ఎం.వెంకటేష్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్రీడాశాఖ సహకారంతో గత 21 రోజుల నుండి నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మంగళవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఇండోర్ స్టేడియం సమీపంలో నిర్వహిస్తున్న ఖో-ఖో శిక్షణా శిభిరంలో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకొని ఇష్టంతో కష్టపడి క్రమం తప్పకుండా సాధన చేసినట్లయితే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గొనేవిధంగా ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులతో కలిసి కొంతసేపు ఖో-ఖో ఆడి ఆటలో ఉన్న మెలుకువలను నేర్పారు. పోల్ టర్నింగ్, పోల్ టచ్, కూర్చొనే విధానం, అటాకింగ్, తప్పించుకోవడం, రన్నింగ్ విధానం, ఖో-ఇచ్చే విధానం, బ్యాలెన్స్ శ్వాస ప్రక్రియను క్రమపద్ధతిలో నియంత్రించుకోవడం లాంటి మెళుకువలను నేర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి జి.అశోక్ కుమార్, రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ ఉపాధ్యక్షులు వై.మహేందర్ రావు, సిద్ధారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సమ్మిరెడ్డి, సూర్యప్రకాష్, కోచ్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో సీసీ కెమెరాలు ప్రారంభం

కరీంనగర్, మే 22: కలెక్టరేట్ మొదటి అంతస్తులో సీసీ కెమెరాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో 16సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, రెవెన్యూ విభాగం మొదలుకుని అవుట్ వార్డు, కలెక్టర్ చాంబర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ చాంబర్స్, ప్రజావాణి నిర్వహించే ప్రాంతంలో అమర్చినట్లు వివరించారు. అలాగే ఈ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఎన్‌ఐసీ విభాగంలో సెంట్రలైజ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు, ఇక్కడ ఈ కెమెరాలకు సంబంధించి ప్రతి కదలిక రికార్డు అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బద్రీ శ్రీనివాస్, డిఆర్వో అయేషామస్రత్ ఖానం, ఈ డిస్ట్రిక్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.