కరీంనగర్

టీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, మే 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో గ్రామాల్లో అభివృద్ధి మెండుగా ఉందని, తద్వారా పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని మైసంపల్లి, కూరెళ్ల, కోహెడలలో మంగళవారం వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కనీవినీ ఎరుగని రీతిగా జరుగుతుందని అన్నారు. ప్రతీ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీల నిర్మాణాలు పూర్తయ్యాయని, స్వశక్తి సంఘాల భవనాలు అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులతో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా గ్రామీణులు ఉన్నారన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో పేద, బడుగు వర్గాలకు సీఎం కెసిఆర్ చేయూతనిస్తున్నారని, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటివి ఈ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. కూరెళ్లలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మైసంపల్లిలో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేసి అనంతరం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ స్వామి, జడ్పీటీసీ లక్ష్మణ్, సర్పంచ్‌లు శ్రీకాంత్, జగన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దమ్మన్నపేట ఎత్తిపోతలకు ప్రభుత్వం ఆమోదం
* ఫలించిన చీఫ్‌విప్ భగీరథ ప్రయత్నం * రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం
ధర్మపురి, మే 22: ధర్మపురి మండలంలోని నియోజకవర్గ కేంద్ర సమీప, గోదావరీ తీరాన ఉన్న దమ్మన్నపేట గ్రామ సంబంధిత ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో దమ్మన్నపేట ప్రాంతీయుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ధర్మపురి శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ తాము ఎన్నికైన నాటినుండీ వృథాగా పోతున్న గోదావరి నీటిని సాగుకు వినియోగించు కోవాలనే లక్ష్యంతో పలు గ్రామాలకు ఎత్తిపోతల పథకాలకై అవిశ్రాంత కృషి చేస్తునే ఉన్నారు. పలు లిఫ్ట్‌లకు నిధులు మంజూరై, రాయపట్నం, తిమ్మాపూర్ పథకాలు ఇటీవలే మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కాగా, రాజారం, జైనా, ఎడవెల్లి, దొంతాపూర్ పథకాల పనులు చివరిదశకు రాగా, దమ్మన్నపేట పథకం కోసం మూడేళ్ళ నుండి పలుమార్లు, తమకు సన్నిహితులైన భారీ నీటి పారుదల మంత్రి తన్నీరు హరీష్‌రావును కలిసి, రైతుల ఇబ్బందుల గురించి వివరిస్తూనే ఉన్నారు. ఇటీవలే స్తంభంపెల్లి పథకం మంజూరు కాగా, ఎట్టకేలకు మంగళవారం ఈశ్వర్ కృషి ఫలించింది. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ అండ్ - కమాండ్ ఏరియా డిపార్ట్‌మెంట్ (మైక్రో ఇరిగేషన్ -2)...జీవో నెం.721 తేది 22.05.2018 ద్వారా 1950.50లక్షలకు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ సంతకంతో పరిపాలనా మంజూరీ లభించింది. తద్వారా 1500 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా కానుంది. దమ్మన్నపేట ఎత్తిపోతల పథక మంజూరీకై సహకరించిర సిఎం కేసిఆర్‌కు, మంత్రి హరీష్‌రావుకు, చీఫ్‌విప్ ఈశ్వర్ కృతజ్ఞతలు తెలుపగా, ఈశ్వర్‌కు, ఐడిసి చైర్మన్ శంకర్‌రెడ్డికి, ధర్మపురి మండల ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.