కరీంనగర్

నిరుపేదల ఆర్థికాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మే 25: నిరుపేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదల అందరికీ అందించేందుకు అంకితభావంతో పని చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన జగిత్యాల పురాణిపేట శివాంజనేయస్వామి కల్యాణ మండలంలో జిల్లా మహిళామోర్చా సమావేశం జిల్లా అధ్యక్షురాలు అర్వ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆకుల విజయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయా..లేదా..? ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అర్హులైన నిరుపేదలందరి అభ్యున్నతి కోసం మహిళా మోర్చ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు ఇంటింటికి వెళ్లి భారత ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం చేస్తున్న పథకాల గురించి ప్రచారం చేస్తూ అవగాహన కల్పించడంలో మహిళా మోర్చ ముందుండాలన్నారు. కేంద్రం అర్హులైన నిరుపేదల అభివృద్ధి కోసం కోట్లాది నిధులు ఖర్చు చేసేందుకు సంసిద్ధతతో ఉందని బూత్ స్థాయి కమిటీలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు, ప్రజలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకుంటూ అభివృద్ధిలోకి రావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ సూచించారు. ఈ కార్యమ్రంలో జిల్లా అధ్యక్షురాలు అర్వ లక్ష్మి, జిల్లా కార్యదర్శి సబియాబేగం, బీజేపీ జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పి. సుజాత రెడ్డి, విద్యాసింగ్, జగిత్యాల మండల అధ్యక్షురాలు ఎడమల మమతా, రాయికల్ మండల అధ్యక్షురాలు తోపారపు లావణ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.