కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, మే 25: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌధమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతమైన నిర్మాణమని కేంద్ర జలవనరుల సంఘం డైరెక్టర్లు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీ నుండి డైరెక్టర్ ఎస్.కె.రాజన్ నేతృత్వంలో మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ శివారులోని కాళేశ్వరం 8వ ప్యాకేజీ పనుల వద్దకు నేరుగా చేరుకున్నారు. అనంతరం బృందం వాహనాల ద్వారా అండర్‌గ్రౌండు టనె్నల్‌లోకి చేరుకున్నారు. అక్కడ నిర్మాణమవుతున్న సర్జ్ఫుల్ హౌస్ పనులను పరిశీలించి అబ్బురపడ్డారు. అనంతరం పైన నిర్మాణమవుతున్న పవర్ స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎవరి సహాయం లేకుండా నిర్మించడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ప్రభుత్వం, అధికారులు ఒక సవాల్‌గా తీసుకొని ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు కన్పిస్తుందన్నారు. 30 ఏళ్లలో కూడా పూర్తికాని ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో నిర్మించడానికి పగలు రేయి కష్టపడుతున్నట్లు ఉందన్నారు. దీనివల్ల రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలోని బీడు భూములు సస్యశ్యామలంగా మారుతాయనడంలో సందేహం లేదన్నారు. ఇక్కడ బిగిస్తున్న మోటార్లకు బాహుబలి పేర్లతో ఉండటం మరో విశేషమన్నారు. వీరి వెంట పి.దేవేందర్ రావు, ఎ.కృష్ణ, ధీరజ్ కుమార్, శేఖర్ కుమార్, డీఎస్ ప్రసాద్, అమిత్ కుమార్ తదితరులు ఉన్నారు.

భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలి
*కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి *హౌసింగ్ బోర్డుకాలనీలో నిర్బంధ తనిఖీలు

కరీంనగర్, మే 25: భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. అక్రమ, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణ, చేదనే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం నగర శివారు హౌసింగ్ బోర్డుకాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాగితాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడం కోసం వివిధ రకాల చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. కార్డన్ అండ్ సెర్చ్‌లతో పలు అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరుడుగట్టిన 34 మంది నేరస్థులపై పీడీ యాక్టు అమలు చేయడం వల్ల దొంగతనాలు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. వివిధ రకాల సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవిధంగా వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను పోస్టు చేసే వారితోపాటు గ్రూప్ అడ్మిన్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేష్ గౌడ్, విజయ్‌కుమార్, రవి, ఆర్‌ఐ జానీమియాతోపాటు వివిధ విభాగాలకు చెందిన 200 మంది పోలీసులు పాల్గొన్నారు. కాగా, నేను సైతం కార్యక్రమంలో భాగంగా హౌసింగ్‌బోర్డుకాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ తన నియోజకవర్గ నిధుల నుండి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కాలనీవాసులు 30 సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ నిధులతోపాటు కాలనీవాసులు అందించిన విరాళాలతో 65 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.