క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 28: అంతర్ జిల్లాస్థాయిలో మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తూ, పలుచోట్ల విక్రయిస్తున్న దొంగల ముఠాను సోమవారం పట్టుకున్నట్లు పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, గత మూడేళ్ళుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల టూ వీలర్లు దొంగతనం చేసి, విక్రయిస్తూ జల్సాలకు పాల్పడుతుండగా, సోమవారం హుజురాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు వెల్లడించారు. హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన గజవెల్లి సమ్మయ్య వృత్తిరీత్యా పెయింటర్ కాగా, చెట్లు కోత పనికి కూడా వెళ్తుంటాడని, అయితే తనకున్న వ్యసనాలతో సంపాదించే డబ్బు సరిపోక ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు సిపి వెల్లడించారు. యాదగిరిగుట్ట, హన్మకొండ, జమ్మికుంట, కరీంగనర్, జగిత్యాల పట్టణాల్లో మోటార్ సైకిళ్ళు దొంగతనం చేస్తూ, చెట్లకోతలో తనకు పరిచయమైన రంగాపూర్ గ్రామానికి చెందిన మోతె కిరణ్‌కు అమ్మిపెట్టమని వాటిని అప్పగిస్తుండేవాడని, ఇదే క్రమంలో చోరీ చేసుకొచ్చిన స్ప్లెండర్ వాహనాన్ని కిరణ్‌కు అందజేసేందుకు వెళ్తుండగా, ఉదయం 8గంటల ప్రాంతంలో సిర్సపల్లి ఎక్స్‌రోడ్‌లో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, అనూహ్యంగా పట్టుబడినట్లు తెలిపారు. మరింత లోతుగా విచారించగా 24 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు అంగీకరించారని, వారి వద్దనుంచి 16 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చాకచక్యంగా పట్టుకున్న హుజురాబాద్ పోలీసులకు నగదు రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో ఏసిపి (అడ్మిన్) సంజీవరావు, హుజురాబాద్ సి ఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.