కరీంనగర్

భక్తిశ్రద్ధలతో రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 16: ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈద్-ఉల్-్ఫతర్ (రంజాన్) వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక పార్ధనల సందండి 11గంటల వరకు కొనసాగింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కొత్త దుస్తులు ధరించి, వేలాది సంఖ్యలో ముస్లిం సోదరులు రంజాన్ వేడకుల్లో ఆనందోత్సహాల మధ్య పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం తరలివచ్చిన ముస్లింలు కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని సాలెహ్‌నగర్ ఈద్గా కిటకిటలాడింది. ఇక్కడికి చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్, జమ్మికుంటలో రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. మిగతా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, స్వచ్చంధ సంస్థలు ఈద్ ముబారక్ తెలుపుతూ బ్యానర్లు కట్టారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు గోదావరిఖని, హుజురాబాద్, జమ్మికుంట, కోరుట్ల, మెట్‌పల్లి తదితర పట్టణాల్లోని ఈద్గాలు, ప్రముఖ మసీదులలో ఈద్-ఉల్-పీతర్ ప్రత్యేక నమాజు నిర్వహించారు. అలాగే గ్రామాల్లోని ప్రార్ధన స్థలాల్లో సైతం నమాజు కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో ప్రార్థనా మందిరాలున్న ప్రాంతాలన్నీ సందడిని సంతరించుకున్నాయి. ముస్లింలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేయగా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రార్థన ప్రాంతాల మీదుగా వాహన రాకపోకలను నియంత్రించి ఇతర దారుల గుండా దారి మళ్ళింపు చర్యలు చేపట్టారు. కాగా, నెలరోజులపాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు రంజాన్ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తానికి రంజాన్ సందర్భంగా నెలరోజుల పాటు నగరం, పట్టణాల్లో నెలకొని ఉన్న సందడి శనివారం నాటి ఈద్-ఉల్-పీతర్ వేడుకతో ముగిసింది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోష్ని కేసు విచారించాలి
* దళిత సంఘాల జేఏసీ డిమాండ్
కరీంనగర్ టౌన్, జూన్ 16: ప్రేమ పేరుతో హత్యకు గురైన దళిత యువతి ఊట్ల రోష్ని కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి, నిందితున్ని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మేడి మహేశ్, అంజయ్య, గజ్జెల ఆనందరావు, సుద్దాల లక్ష్మన్ తదితరులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దళితుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని ఆశిస్తే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో చీకట్లు కమ్ముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరితో దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతుండగా, రాష్ట్రంలో రోజుకొకరు చొప్పున అసువులు బాస్తున్నారని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దళితుల పరిస్థితి కడు దయనీయంగా మారిందని, ఇందుకు నిదర్శనమే మంథని మధుకర్ హత్య, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన నేరెళ్ళ దళితులపై పోలీసుల దాష్టీకం, పొలానికి నీరందించేందుకు వెళ్తున్న దళిత జంటపై పెద్దపల్లి పోలీసుల దాడి, ఉన్నతాధికారుల వేధింపులతో ధర్మపురిలో ఇంజనీర్ ఆత్మహత్య, ఇల్లంతకుంట మండలంలో తండ్రీ కొడుకుల హత్య పరంపర కొనసాగటమని అన్నారు. సమాజంలో మారుతున్న రాజకీయాల నేపథ్యంలో చైతన్యవంతులవుతున్న దళితులు తమ హక్కులు కాపాడుకునేందుకు రాజకీయాల్లో తమ వాటా పెంచుకునేందుకు ఆరాట పడుతున్న క్రమంలోనే, పథకం ప్రకారం అడ్డుకునేందుకు దాడులకు ప్రేరేపించేలా పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. అగ్రకులాల ఆధిపత్యానికి గండికొడుతామనే భయంతోనే కుట్ర రాజకీయాలకు తెరతీస్తూ, వెనుకదెబ్బ తీస్తున్న తీరు తేటతెల్లమవుతోందన్నారు. దళితులకు జరగుతున్న అన్యాయంపై దళిత ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవటం శోచనీయమని, కేవలం తమ సీట్లు పదిల పర్చుకునేందుకే యావత్ దళిత జాతికి ద్రోహం చేస్తున్న నేతలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా దళితులకు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలోదళిత వ్యతిరేకిగా గుర్తించక తప్పదన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు గసికంటి అరుణ్, గోస్కి అజయ్, బొలుమల్ల సదానందం, వి.్భస్కర్, సోనాది వెంకటేశ్, బోయినపల్లి చంద్రయ్య, సందబోయిన ఉమేశ్‌చంద్, దండి రవీందర్, ఇరుకుల్ల యాదగిరి, తుంగ బాబురావు, జీడి రమేశ్, గండి గణేశ్, దామర సత్యం, తదితరులు పాల్గొన్నారు.