కరీంనగర్

దళితులపై వివక్షతతోనే దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూన్ 16: దేశంలో, రాష్ట్రంలో దళిత కుటుంబాలకు భద్రత కరువైపోతున్నాయని, రోజురోజుకు దళితులపై దాడులు, దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కరీంనగర్‌లో ప్రేమ ఉన్మాది చేతిలో హత్యకు గురైన దళత యువతి రసజ్ఞ కుటుంబాన్ని గోదావరిఖనిలో ఆయన పరామర్శించారు. శనివారం సాయంత్రం రసజ్ఞ అంతక్రియల్లో మందకృష్ణ మాదిగ పాల్గోన్నారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రేమను తిరస్కరించినందుకు రసజ్ఞను గోంతు కొసి హత్య చేసిన వంశిని అతనితోపాటు అతని కుటుంబ సభ్యులను సైతం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రసజ్ఞ కుటుంబానికి రూ 25లక్షల పరిహారం, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం నెలకు 5వేల పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. లేదంటే రసజ్ఞ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఎమ్మార్పీఎస్ ముందుండి పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. రసజ్ఞ హత్యకు సంబందించిన సంఘటన వ్యవహరాలు పరిహారం చెల్లింపులకు సంబందించి న్యాయం జరిగేందుకు మంద కృష్ణ మాదిగ ఈ సందర్బంగా జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యుడు రాములుతో ఫోన్‌లో మాట్లాడి పెద్దపల్లి జిల్లా అధికారులతో సైతం కాన్ఫరెన్స్‌తో మాట్లాడించి ఆదేశాలు ఇప్పించారు. దళితులపై జరుగుతున్న దాడులను కృష్ణ మాదిగ ఖండిస్తు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.రసజ్ఞ అంతక్రియలకు మంద కృష్ణ హజరు కావడంతో ఏదైన ఆందోళన జరుగుతుందేమోనని పోలీస్ బలగాలు అడుగడుగున బందో బస్తు చేపట్టాయి.ఆయన వెంట రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారయణ, జన సమితి పెద్దపల్లి జిల్లా నేత పెంట రాజేష్, ఎమ్మార్పీఎస్ నేతలు మంద రవి కుమార్, పల్లె బాపు, రాచపల్లి రవి, కాంగ్రేస్ నేతలు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్‌తో పాటు దళిత, మహిళ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.