కరీంనగర్

రోడ్డెక్కిన బల్వంతాపూర్ గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూన్ 18: జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారుల్లో నడుస్తున్న క్వారీల వల్ల అడవి జంతువులు ఊళ్లోకి రావడంతో ప్రజలకు ప్రమాదం, పంటలు నాశనం అవుతున్నాయని సర్పంచ్‌తో సహా గ్రామస్థులు ఆందోళనచేస్తూ క్వారీలు నిలుపుచేయాలనే డిమాండ్‌తో రోడ్డెక్కారు. సోమవారం జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 2గంటల పాటు బైఠాయించి గ్రామస్థులంతా ధర్నా చేశారు. సీఐ ప్రకాష్‌కు గ్రామస్థులకు మధ్య ఒక దశలో వాగ్వాదం జరిగింది. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధర్నా చేస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఇలాగే మొండిపట్టుపడితే కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సర్పంచ్ బాబు జోక్యం చేసుకొని తమ సమస్యలు విన్నవించడానికే రోడ్డెక్కాల్సి వచ్చిందని అధికారులకు వినతి పత్రం ఇచ్చి వెళ్లిపోతాం అనడంతో పరిస్థితి సద్దుమణిగింది. బల్వంతాపూర్ గ్రామస్థులు క్వారీలు నిలిపి వేయడంతో పాటు కొత్త క్వారీలకు అనుమతి ఇవ్వరాదనే చేపట్టిన ధర్నాతో సుమారు 2గంటలు జగిత్యాల -కరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయ. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాబు తోపాటు పలువురు గ్రామస్థులు విలేఖరులతో మాట్లాడుతూ మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులో ఇప్పటికే 7క్వారీలు నడుస్తున్నాయని మరో 4క్వారీలకు అధికారులు అనుమతి ఇవ్వబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నడుస్తున్న క్వారీల వల్ల అడవి జంతులు ఊరుపై పడి ప్రాణ, పంట నష్టం కలుగుతుందని, క్వారీలోని దుమ్మంతా ఊరిలోని ఇళ్లలోకి కొట్టుకొచ్చి అనారోగ్యం భారీన పడుతున్నారని గతంలో 2సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ బాగోగుల గురించి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తమ ఆవేదన అరణ్య రోధనే అవుతుందడడంతో గ్రామస్థులంతా సంఘటితంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికైనా కలెక్టర్ శరత్ స్పందించి ప్రస్తుతం ఉన్న క్వారీలు నిలిపి వేయడంతోపాటుగా కొత్త క్వారీలకు అనుమతులు ఇవ్వరాదని డిమాండ్ చేశారు.