కరీంనగర్

బీజేపీలో చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 18: కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వారి అనుచరులతో కలిసి సోమవారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ నాయకురాలు పురందేశ్వరి సమక్షంలో రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ నేతృత్వంలో 250 మందికి పైగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కమలదళంలో చేరగా, వారినుద్ధేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేడు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందని విమర్శించారు. కేవలం మంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే టీడీపిని వీడిన కేసీ ఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మను, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. అందుకే ఆపార్టీ నాయకులు, కార్యకర్తలంతా బీజేపి వైపు చూస్తున్నారని అన్నారు. గతంలో టీడీపి ఓటుబ్యాంక్ రాబోయే ఎన్నికల్లో బీజేపికి మారుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు బలపడుతున్నాయన్నారు. మాజీ కేంద్ర మంత్రి డా.దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు భారతీయ జనతాపార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. తెలంగాణలోకాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చేయించుకున్న సర్వేలే బీజేపి అధికారంలోకి రాబోతున్నట్లు తేల్చిచెబుతుండగా, దీనిని సద్వినియోగం చేయటంలో యువత కీలక భూమిక పోషించాలన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పోటీపడి నటిస్తున్నాయని ఆమె విమర్శించారు. తెలంగాణ రాజకీయాలను కుల,మత రాజకీయాలుగా విభజిస్తున్న గత, తాజా పాలకులకు రాబోయే ఎన్నికల్లో సమాధి కట్టి బీజేపిని గెలిపించి, అధికారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారిలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గాజె రమేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్, నగర అధ్యక్షులు అంజనేయులు, టీడీపీ నాయకులు నంది సంపత్, తాడూరు మధుకర్, రాచమల్ల రాజు, మహేశ్ యాదవ్, ఎర్రోజు రాజేందర్‌లతో పాటు వందల సంఖ్యలో టీడీపి కార్యకర్తలు, బీసీ సంఘం నాయకులు ఉన్నారు. వారి వెంట స్థానిక నాయకులు కొట్టె మురళీకృష్ణ, బేతి మహేందర్‌రెడ్డి, తాళ్ళపల్లి శ్రీనివాస్, మేరుగు పర్శరామ్, జువ్వాజి రమేశ్, దుబాల శ్రీనివాస్, రమణారెడ్డితో పాటు పలువురు ఉన్నారు.