కరీంనగర్

మోదీతోనే నవభారత నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూన్ 21: కేంద్ర పభుత్వ పథకాలను బూత్ స్థాయిలోకి తీసుకెళ్లాలాని, దేశంలో నరేంద్ర మోడీ వల్లనే నవభారత నిర్మాణం సాధ్యమని బీజేపి జిల్లా అధ్యక్షులు కోత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణమండపంలో మండల కార్యవర్గసమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోత్త శ్రీనివాస్‌రెడ్డి హజరై మాట్లాడుతూ దేశంలో 11కోట్ల మంది సభ్యత్వం కలిగి, 21 రాష్ట్రంలో అధికారంలో కోనసాగుతున్న పార్టీ బీజేపి అన్నారు. కేంద్రం ఇస్తున్నటువంటి నిదులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తు ప్రజలను మోసం చేస్తున్నాడని అరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలన కోనసాగుతుందన్నారు. దేశ ప్రజల అభివృద్ధికోసం 435 పథకాలను నరెంద్ర మోడీ ప్రవేశపెట్టిన్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అనేకమైనటు అవినితి అక్రమాలు జరుతున్నాయని కాంగ్రెస్ పార్టీని అవలంబించిన విదానాలనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తుందని అరోపించారు. రానున్న రోజుల్లో రైతులు, దళితులు, యువకులు మహిళలు అందరు కలిసి టిఆర్‌ఎస్ ప్రభుత్వాని గెద్దదించుతారని, 2019లో కేంద్రం, రాష్ట్రంలో అధికారం చెప్పటడం ఖాయన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళితమోర్చా ప్రధాన కార్యదర్శి గడ్డం, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల స్వప్న, వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరచారి, మండల అధ్యక్షులు శ్రీనివాస్, మల్లారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి సాక్షర భారత్ ఉద్యోగుల సమస్యలు
* ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి రూరల్, జూన్ 21: సాక్షర భారత్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీ ఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కోన్నారు. సాక్షర బారత్ పథకాన్ని కొనసాగించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సాక్షర భారత్ ఉద్యోగులు స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో గల తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు గురువారంతో 17వ రోజుకు చేరాయి. సాక్షర భారత్ ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే దాసరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షర భారత్ ఉద్యోగులకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని, మీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. స్థానిక జడ్పీటీసీ యాట దివ్యారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంథని నర్సింగ్, భూషణవేన సురేష్ గైడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్ సాక్షర భరత్ ఉద్యోగుల దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపారు. సాక్షరభారత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేగొండ రవికుమార్ యాదవ్, నాయకులు లక్మణ్, మండల, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.