కరీంనగర్

విలేఖరి కుటుంబం ఆత్మహత్యకు.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 21: సిద్ధిపేట జిల్లా కొండపాక మండల ఆంధ్రభూమి విలేఖరి హన్మంతరావుకుటుంబం ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతోనే ఆర్థిక ఇబ్బందులతో చిన్నాభిన్నమవుతూ, బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు, నేతన్నల జాబితాలో జర్నలిస్టులు కూడా చేరుతున్నారని, తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విలేఖర్ల పరిస్థితులు కడుదయనీయంగా మారగా, కుటుంబాలను కూడా పోషించుకోలేని దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం వేజ్‌బోర్డు అమలు చేయించటంతోపాటు, అంతకన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించి ఆదుకుంటానంటూ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు కనీసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. హెల్త్‌కార్డుల మంజూరీలో కూడా జాప్యం ప్రదర్శిస్తుండగా, అనారోగ్యాల బారిన పడ్డ జర్నలిస్టులు పదుల సంఖ్యలో మరణించినా స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పాత్రికేయులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే నడుం బిగాంచాలని,‚లేకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో హెచ్చరించారు.
బల్దియాకు స్కాచ్ అవార్డు
* అందుకున్న మేయర్ రవీందర్ సింగ్
కరీంనగర్ టౌన్, జూన్ 21: ప్రతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డును నగర పాలక సంస్థ సొంతం చేసుకుంది. అభివృద్ధిపనుల్లో బల్ధియా సాధిస్తున్న పురోగతి దృష్ట్యా ప్రకటించిన ఈ అవార్డును నగర మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ గురువారం న్యూఢిల్లీ కానిస్ట్యూషన్ క్లబ్‌లో అందుకున్నారు. ఎల్‌ఈడి అంశం కింద భారతదేశం నుంచి వచ్చిన 900మంది ఓటింగ్‌లో పాల్గొనగా, బల్ధియాకు అవార్డు దక్కింది. హరితహారం, ఓపెన్‌జిమ్ ప్రాజెక్టు, ఎల్‌ఈడి లైట్లు, సిటిజన్ సర్వీసెస్, కరీంనగర్ సిటిజన్ బడ్డీయాప్‌లకు మూడు విభాగాల్లో స్కాచ్ అవార్డుప్రధానం చేశారు. అలాగే, ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా లభించింది. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజల కృషితోనే దేశంలో కరీంనగర్ ఖ్యాతి పెరిగిందన్నారు. స్మార్ట్‌సిటీ ఏర్పాటులో కూడా నగరవాసులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అవార్డు స్వీకరించేందుకు బల్ధియా అధికారులు కోటేశ్వర్, రామన్, యాదగిరి, చైతన్య, కల్యాణ్, తదితరులు వెళ్లారు.