కరీంనగర్

డీఇవో కార్యాలయానికి తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 21: పెద్దపల్లి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి విద్యార్థి సంఘాల నాయకులు గురువారం తాళం వేశారు. గత కొంత కాలంగా ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమ వసూళ్లపై జిల్లా విద్యా శాఖ అధికారికి విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అయినా విద్యా శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు ఏకంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉన్న జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో కొద్ది సేపు కార్యాలయ సిబ్బంది అందులోనే ఉండి పోవడంతో పాటు విధులకు ఆటంకం కలిగింది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై కర్రి జగదీష్ పోలీసు సిబ్బందితో వచ్చి ఆందోళన కారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పాఠ్య పుస్తకాలు ముద్రించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే ఏకరక దుస్తులు కూడా వారే తయారు చేసి ఏకంగా పాఠశాలల్లో విక్రయిస్తున్నారని, ఈ విషయమై పలు మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా, ప్రైవేట్ యాజమాన్యాల తొత్తుగా విద్యా శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు స్పందించక పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బత్తిని సంతోష్, ప్రశాంత్, బబ్బుల్, బాలసాని లెనిన్, శ్రీకాంత్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.