కరీంనగర్

1 నుంచి శృంగేరీ జగద్గురు విజయయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 21: నగరంలో శ్రీ శృంగేరీ జగద్గురు విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్ర జూలై 1 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు జగద్గురు సేవా సమితి బృందం తెలిపింది. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ విజయ యాత్రలో భాగంగా జూలై 1 సాయంత్రం 5 గంటలకు నగర శివారులోని నగునూరులోని దుర్గ్భావాని దేవాలయంలో స్వామి వారి ధూళి పాదపూజ, స్వాగత పత్ర సమర్పణ తలపెట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం కోలాటాలు, మంగళహారతులు, బ్రహ్మణోత్తముల వేదఘోషల నడుమ పూర్ణకుంభ స్వాగతం చేపట్టనున్నట్లు, రాత్రి 8.30 గంటల నుంచి శారదాచంద్రవౌళీశ్వరుల అర్చన ఆలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కుల, మతాలకతీతంగా భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొంది, అదే రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మహాప్రసాదం స్వీకరించాలని కోరారు. వేదపండితులు డా. దాచంపల్లి సంతోష్‌కుమార శాస్ర్తీ, చిలుకపాటి హన్మంతరావు, బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, వీహెచ్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాళ్ల రాజేందర్ రెడ్డి, గోసేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడు వినోద్, బ్రాహ్మణ సేవా సమితి ప్రతినిధులు రామక విఠల్‌శర్మ, రాజశేఖర శర్మ, కేవీ శర్మ, రవీందర్‌రావు గురుస్వామి పాల్గొన్నారు.
జయశంకర్ ఆశయాలు కొనసాగించాలి
* మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి
జగిత్యాల, జూన్ 21: తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలకులు సామాజిక తెలంగాణ దిశగా ఆడుగులు వేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో డెమోక్రటిక్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కుర్మాచలం ఉమామహేష్ ఆధ్వర్యంలో గురువారం జయశంకర్ 7వ వర్ధంతి ఎస్‌కెఎన్‌ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల ఎదుట గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక వైపు జయశంకర్ సార్ ఉద్యోగం నిర్వర్తిస్తూనే మరో వైపుతన రచనలు,సదస్సుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ప్రపంచానికి తెలియజేశారన్నారు. జయశంకర్ జీవితాంతం బ్రహ్మ చారిగా గడుపుతూ తన కొద్దిపాటి భూమి ప్రభుత్వ స్కూల్‌కు దానం చేసిన మహాన్నత వ్యక్తి అని కొనియాడారు. బతుకమ్మ లాంటి తెలంగాణ పండుగలను గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి అని పాలకులు పట్టుదలకుపోకుండా జయశంకర్ ఆశయాల సాధన కోసం అంకితమై పని చేయాల్సిన అవసరం ఉందని విజయలక్ష్మి గుర్తు చేశారు. కార్యక్రమంలో జగిత్యాల మండల పరిషత్ ఉపాధ్యక్షులు గంగం మహేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు, టీజేసీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, టీవీ సూర్యం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండ శంకర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు బాలె శంకర్, కార్మిక నాయకులు తొగిటి గంగాధర్, టీడీపీ నాయకులు దయ్యాల మల్లారెడ్డి, కోరుకంటి రాము, దాసరి శ్రీనివాస్, రాంబాబు, వంగల భాస్కర్, సూర్యనారాయణ, రవీందర్, కొమురవెల్లి లక్ష్మినారాయణ, భీష్మాచారి, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.