కరీంనగర్

ప్రణాళిక లేకుండా టీఆర్‌ఎస్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, జూన్ 21: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా పాలన సాగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి ఆరోపించారు. గురువారం జమ్మికుంట పట్టణంలో విలేఖర్ల తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంట్లో ఉం డి పాలన సాగిస్తుంటే సమస్యలు, అధికారుల విధి విధానాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు అమ్ముకున్న ధాన్యం డబ్బులు సుమారు 1500 కోట్లు చెల్లించలేదన్నారు. పాస్ పుస్తకాలలో అవకతవకలు, అధికారుల తప్పిదాలు, మంత్రుల అవగాహన రాహిత్యంతో పాలన నడుస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నరని.. తగిన సమయంలో బుద్ధి చెపుతారని హితవు పలికారు. కార్యక్రమంలోనాయకులు చందగాంధీ, ఎంపీటీసీ సభ్యుడు సచిన్‌రెడ్డి, మొగిలితోపాటు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి
* మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్
పెద్దపల్లి, జూన్ 21: అవినీతికి కొమ్ము కాస్తున్న పెద్దపల్లి జిల్లా రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి జితేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి డీఆర్వో బైరం పద్మయ్య గతంలో సుల్తానాబాద్ తాశీల్దార్‌గా పనిచేసినప్పుడు మాజీ సైనికుడికి కదంబాపూర్ గ్రామంలో మంజూరైన క్వారీ కోరకు ఎన్‌వోసీ సర్ట్ఫికెట్ కొరకు ధరఖాస్తు చేయగా ఆమాజీసైనికుడి వద్ద పద్మయ్య రూ. 1లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఆసైనికుడు ఆవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించగా వారు చేసిన దాడిలో పద్మయ్య రూ. 40వేలు లంచం తీసుకుంటు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి జిల్లాకు పద్మయ్యను డీఆర్వోగా పదోన్నతులు ఇవ్వడం తగునా ప్రశ్నించారు. సమావేశంలో సంఘం నాయకులు మహేష్, సునిత, కొమురయ్య, రాజు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.