కరీంనగర్

ఒంటికి ‘యోగా’ మంచిదేగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 21: అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించిన యోగా శిబిరాలు ఉత్సాహంగా..ఉల్లాసంగా కొనసాగగా, పెద్ద సంఖ్యలో పాల్గొన్న చిన్నా, పెద్దా, ముసలి, ముతక యోగాసనాలు వేస్తూ యోగ ముద్రలోకి వెళ్లారు. సాధకులు వేసిన వివిధ యోగాసనాల విధానాన్ని అనుకరిస్తూ యోగాసనాలు అభ్యసించారు. ఒకేచోట పెద్ద సంఖ్యలో జనం కనబడటంతో ఆ ప్రాంతంలో పండు
గ వాతావరణం కన్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యోగా శిబిరాలు జన సందడితో కళకళలాడాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాలతోపాటు సుల్తానాబాద్, గోదావరిఖని, మంథని, జమ్మికుంట, హుజురాబాద్, వేములవాడ, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, గంగాధర, చొప్పదండి, తదితర మండలా ల్లో యోగా శిబిరాలు ఉత్సాహంగా కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు యోగా శిబిరాల్లో పాల్గొన్నారు. పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సైతం ఆయా యాజమాన్యాలు యోగా శిబిరాలను ఘనంగా నిర్వహించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఆయుష్, పోలీసుశాఖ, వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో నిర్వహించిన యోగా శిబిరానికి విశేష స్పందన లభించింది. సమారు 2వేల మంది పరేడు మైదానంలో యోగాసనమేసి అదరగొట్టారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శశాంక, తదితరులు పాల్గొని యోగాసనాలు వేసి, అందరిలో ఉత్సాహాన్ని నింపా రు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించి, మానసికోల్లాసాన్ని పొందేందుకు యోగా సాధన అత్యుత్తమ మార్గమన్నారు. కరీంనగర్‌లో ఆయుష్ కేంద్రం, యోగా కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం రూ.1.30 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందన్నారు. మనదేశంలో పుట్టిన యోగాను నిర్లక్ష్యం చేయడం సరికాదని తెలిపారు. యోగా సాధనకు అం దరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
యోగా మాస్టర్ ఆనంద్‌శర్మ, భారతస్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షుడు ముత్యాల రమేష్, డీసీపీ శ్రీనివాస్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.