కరీంనగర్

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలో ఎప్పటిమాదిరిగానే బాలికల హవా కొనసాగింది. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ విభాగాల్లో కలిపి మొత్తంగా 59 శాతంతో బాలికలు జయకేతనం ఎగరేశారు. వేర్వేరుగా పరిశీలిస్తే మొదటి సంవత్సరంలో 53.83, రెండో సంవత్సరంలో 64.11 శాతం ఫలితాలు సాధించారు. మొదటి ఏడాది ఫలితాల్లో 47 శాతం, రెండో ఏడాది ఫలితాల్లో 58 శాతం ఫలితాలు వచ్చాయి. మొదటి ఏడాదిలో 38,168 మంది విద్యార్థులు హాజరుకాగా, 17,894 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 11,738 మంది బాలికలు, 6,156 మంది బాలురు ఉన్నారు. 20,268 మంది అనుత్తీర్ణులయ్యారు. వీరిలో 10,068 మంది బాలికలు, 10,200 మంది బాలురు ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 37,247 మంది విద్యార్థులు హాజరుకాగా, 21,532 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 13,684 మంది బాలికలు కాగా, 7,848 మంది బాలురు ఉన్నారు. 15,702 మంది అనుత్తీర్ణులు కాగా 7,659 మంది బాలికలు, 8,043 మంది బాలురు ఉన్నారు. ఉత్తీర్ణులైన వారిలో గ్రేడ్‌ల వారీగా పరిశీలిస్తే బాలికలు ఏ గ్రేడ్‌లో 6,435 మంది, బి గ్రేడ్‌లో 4,812, సి గ్రేడ్‌లో 1862, డి గ్రేడ్‌లో 575 మంది ఉన్నారు. బాలుర విభాగంలో ఏ గ్రేడ్‌లో 3,287 మంది, బి గ్రేడ్‌లో 2,588, సి గ్రేడ్‌లో 1,387, డి గ్రేడ్‌లో 586 మంది ఉన్నారు. వొకేషనల్ విభాగంలో మొదటి ఏడాది 5,187 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,496 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1314 మంది బాలికలుండగా, 1182 మంది బాలురు ఉన్నారు. 2690 మంది అనుత్తీర్ణులు కాగా, 48.12శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 3,907 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,179 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1194 మంది బాలురు, 985 మంది బాలికలు ఉన్నారు. 1,728 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 55.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల సరళీలో జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈసారి రెండు శాతం ఫలితాలు పెరిగాయి. ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఉత్తీర్ణతశాతం పెరగటం గమనార్హం. ప్రైవేట్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతంతో పాటు ర్యాంకుల పంట కూడా పండింది. నగరంలోని అల్పోర్స్ కళాశాలలో 993 మార్కులతో రాష్టస్థ్రాయిలో మూడో ర్యాంకు సాధించగా, 985 ఆపై మార్కులను 200 మంది విద్యార్థులు సాధించారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో వందశాతం, సైన్స్ విభాగంలో 98 శాతం ఫలితాలను విద్యార్థులు సాధించారు. ఈసందర్బంగా ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సుహాసిని మాట్లాడుతూ కాచివడపోసిన విధంగా జిల్లాలో ఇంటర్ ఫలితాలు వచ్చాయన్నారు. మాస్ కాపీయింగ్‌కు ఎక్కడ అవకాశం ఇవ్వలేదన్నారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజు చివరి తేదీ ఈనెల 30 వరకు ఉన్నట్లు, మే 24 నుంచి 31 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.