క్రైమ్/లీగల్

ప్రియుడు మోసగించాడని యువతి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జూన్ 26: ప్రియుడి మోసంతో ప్రియురాలు నిద్రమాత్రలు మింగి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి అనే యువకుడు కామారెడ్డి జిల్లాకు చెందిన సత్య అనే యువతిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు నాలుగు రోజుల క్రితం మర్రిగడ్డకు చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రేమజంటకు స్థానిక ఎస్‌ఐ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మనస్థాపానికి గురైన సత్య ప్రియుడు మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ సమీపంలో నిద్ర మాత్రలు మింగగా సత్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

భర్తను చంపిన భార్య
గొల్లపల్లి, జూన్ 26: గొల్లపల్లి మండలంలోని దట్నూర్ గ్రామంలో అలిశెట్టి రమేష్ పది సంవత్సరాల క్రితం ఆయన మామ అయిన కొండి మల్లయ్యను హత్య చేయగా అప్పటి నుండి కుటుంబంలో తరచు కలహాలు జరుగుతుండేవి. మంగళవారం కుటుంబంలో గొడవ జరుగగా అలిశెట్టి రమేష్‌కు, ఆయన భార్యాపిల్లలకు మాట మాటా పెరిగి గొడవ జరుగగా పక్కనే ఉన్న సిమెంటు ఇటుకతో భార్య రమ, కూతురు నాగరాణిలు రమేష్ తలపై మోది హత్య చేశారు.

గీత కార్మికుడి ఆత్మహత్య
కోహెడ, జూన్ 26: మండల కేంద్రమైన కోహెడకు చెందిన బొమ్మగాని చంద్రవౌళి (55) అనే గీతా కార్మికుడు క్రిమిసంహారక మందు సేవించి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం కల్లు సేకరించేందుకు గాను వెళ్లిన ఈయన ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉండగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ పోలీసుల గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్
ముకరంపుర కరీంనగర్, జూన్ 26: నగరంలో నకిలీ పోలీసుల భాగోతాన్ని మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే..బత్తిని అవినాష్ (28) (ఆరెపల్లి), కినె్నర కృష్ణ (31) (పద్మనగర్)కు చెందిన ఇరువురు నగరంలోని ఒక లాడ్జిలో బస చేస్తున్న జంటలను టార్గెట్ చేస్తూ వారిని రహస్యంగా వీడియో చిత్రీకరించి వేదింపులకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో అక్కడకు వచ్చిన జంటలను ఫోన్ ద్వారా వారి వ్యక్తిగత వివరాలను, లాడ్జిలో బస చేసిన విషయాలను చెప్పి మేము టాస్క్ఫోర్స్ పోలీసులము, మీపై ఎలాంటి పోలీసు కేసులు లేకుండా ఉండాలంటే మేము చెప్పిన ప్రదేశానికి రావాలని ఫోన్ ద్వారా చెప్పేవారు. బాధితులు ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్‌కు ఫిర్యాదు చేయగా పక్కా ఆధారాలతో వారిపై వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను, వివిధ రకాల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.