కరీంనగర్

ఉమ్మడి పాలనలో కరవు కనిపించలేదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 22: స్వాతంత్య్రానంతరం కొనసాగిన ఉమ్మడిపాలనలో ఏళ్ళతరబడి ఏర్పడ్డ కరవు ప్రతిపక్షాలకు కనిపించలేదని, నాటినుంచి ఆనవాయితీగా వస్తున్న దీనిని పారదోలేందుకు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసి ఆర్ చేపడుతున్న పలు పథకాలతోనే గుర్తుకువస్తోందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి, సిపి ఐలు ప్రతిపక్ష పాత్రకు బదులు శకుని పాత్రను పోషిస్తున్నాయని మండిపడ్డారు. సమీపభవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకున్నా ఆయాపార్టీలు ఇంకా ఓట్ల రాజకీయాలు చేయటం అవివేకమని ఎద్దేవా చేశారు. ఆయాపార్టీల పాలనలో వచ్చిన కరవు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితే, నేడు ఈ దుస్థితి పట్టేది కాదన్నారు. తాత్కాలిక ఉపశమనం కల్గించి, ప్రజలను నిలువునా దోచుకున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడిపాలనతో తెలంగాణ సర్వం కోల్పోయిన నేపథ్యంలోనే తమపార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసి ఆ ర్ తెలంగాణలో శాశ్వతంగా కరవును నివారించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, అమలుకు శ్రీకారం చుట్టారని స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోచేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణమని తేల్చిచెప్పారు. చిన్ననీటి వనరుల అభివృద్ది కూడా ఈక్రమంలోనే కొనసాగుతుందని, ఉమ్మడి పాలనలో రాష్ట్రంలో94చెరువులుంటే, 49వేలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిలయాలయ్యాయని, ఇందులో అత్యధికశాతం తెలంగాణ రాష్ట్రంలోనివేనన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంతో గ్రామాల్లోని చెరువుల్లోనే 200 టి ఎంసిల నీటిని నిల్వచేసుకోబోతున్నామని, పశు,పక్ష్యాదులకు సైతం తాగునీటి సమస్య తెచ్చిన ఘనత గతపాలకులదేనన్నారు. కరవు నివారణ చర్యలకు, తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.100కోట్లు కేటాయించి, ఇప్పటికే 50శాతానికి పైగా నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఈనెల 27న ఖమ్మంలో జరిగే టి ఆర్ ఎస్ ప్లినరీకి జిల్లానుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో జడ్పీటీసి తన్నీరు శరత్‌రావు, కో ఆప్షన్ సభ్యుడు జమీలొద్దిన్, ఎంపిపి వాసాల రమేశ్,నాయకులు కట్టసతీష్,వరాల జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు.