కరీంనగర్

ఏసీబీని నిర్వీర్యం చేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్,జూలై 20: రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు నిత్యం పరితపిస్తున్న అవినీతి నిరోధక శాఖను నిర్వీర్యం చేస్తే సహించబోమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జానపట్ల స్వామి హెచ్చరించారు. ఉమ్మడి పాలకుల కన్నా భిన్నంగా గత నాలుగేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ అవినీతి విస్తరిస్తోందని, అధికారులు అడ్డు అదుపులేకుండా వ్యవహరిస్తుండటంతో మూడు పూవులు ఆరు కాయలుగా అక్రమాల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే గత కొంతకాలంగా పలు ప్రభుత్వ విభాగాల్లో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులేనన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రిడిజైన్ పేర కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాల్లో నెలకొన్న అవినీతిలో తమకున్న భాగస్వామ్యం బహిర్గతమవుతుందనే భయంతోనే అవినీతి నిరోధక శాఖ పై సమీక్షిస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నాడని విమర్శించారు. పేద ప్రజల అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో నీతివంతమైన, పారదర్శక పాలనతోనే సాధ్యమవుతుందని, దీనిని సుసాధ్యం చేయకుండా అవినీతిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయటం శోచనీయమన్నారు. అవినీతి నిరోధక శాఖకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం, నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందన్నారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని ప్రకటనలో హెచ్చరించారు.

సీజనల్ వ్యాధులపట్ల తస్మాత్ జాగ్రత్త

ఇల్లందకుంట, జూలై 20: వర్షకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా మలేరియా నియంత్రణాధికారి డాక్టర్ రాజగోపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని పాతర్లపల్లి గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల్లో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను చూసి అధికారులపై మండిపడ్డారు. వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా నివాస గృహాల ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతనును తప్పనిసరిగా పాటించాలన్నారు.అలాగే జ్వరాలు సోకినప్పుడు నిర్లక్ష్యంగా వహించకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి ప్రజలు రోగాల భారినపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డాక్టర్ విజయరావు, మహేందర్‌రెడ్డి, రమనందం, సూపర్‌వైజర్ అనిత, ఆశవర్కర్లు తదితరులు ఉన్నారు.

ఆసుపత్రిలో అసౌకర్యాలతోనే బాలింత మృతి చెందిందంటూ కాంగ్రెస్ ధర్నా
ధర్మపురి, జూలై 20: ధర్మపురి క్షేత్రంలోని ప్రభుత్వ క్లస్టర్ అసుపత్రిలో సౌకర్యాల లేమితోనే గురువారం రాత్రి బాలింత మృతి చెందినదని, ఆమె కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం ధర్మపురి ప్రభుత్వ క్లస్టర్ అసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు గంటసేపు బైఠాయించి, ధర్నా చేశారు. ధర్మపురి క్షేత్రానికి చెందిన ఎస్‌కే ఇర్ఫాన్ సతీమణి షాహిని (21) 18వ తేదీన ప్రసవం కోసం ధర్మపురి ప్రభుత్వాసుపత్రిలో చేరగా, 19న మధ్యాహ్నం వైద్యురాలు ఆపరేషన్ చేయగా మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు ఫిట్స్ రాగా, జగిత్యాల ఆసుపత్రికి, అనంతరం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీంతో మృతురాలి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అవిభక్త కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లగౌడ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు బైఠాయించి, నిరసన గళాలు విప్పి, నినదించి, ధర్నా చేసి, డిమాండ్ చేశారు. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ముస్కు జయపాల్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. నాయకులు చిలుముల లక్ష్మణ్, చుక్క రవి, సింహరాజు ప్రసాద్, పాల గణేశ్, సత్యనారాయణ, కొంపల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.