కరీంనగర్

డీఐజీ ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 20: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ రేంజి డీఐజీ పి.ప్రమోద్‌కుమర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి పోలీస్ స్టేషన్‌లను, ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయంను తనిఖీలు నిర్వహించారు. రికార్డుల పరిశీలించారు. కేసుల వివరాలపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలను తనిఖే చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను నాటి హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే, సిరిసిల్ల డీఎస్పీ ఎన్.వెంకటరమణ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ నరహరి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మత్స్యకారుల కోసం ప్రత్యేక అవగాహనా కేంద్రాలు

* ఎన్‌ఎఫ్‌డీబీ టెక్నికల్ డైరెక్టర్ విశ్వనాథ్
తిమ్మాపూర్, జూలై 20: మత్స్యకారుల కోసం మత్స సంపదను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిషరీస్ అక్వా సెంటర్ల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ డైరెక్టర్ విశ్వనాథ్ అన్నారు. మండలంలోని అల్గునూర్ గ్రామ శివారులో గల దుర్గమ్మగడ్డ వద్ద ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో స్టాంప్ ఐటీ బిజినెస్ సొల్యూషన్స్, సాంన్రే లాబోరెటరీస్ సర్వీస్ సంయుక్తంగా అక్వా వన్ సెంటర్‌ను శుక్రవారం ఆయనతో పాటు స్థానిక సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ సభ్యులు సింగిరెడ్డి స్వామిరెడ్డిలు ప్రారంభించారు. మత్సకారులు చేపల పెంపకందారులతో పాటు రైతులకు ఈ సేవా కేంద్రం ఎంతో ఉపయోగపడుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ఈ సెంటర్‌లో ల్యాబొరేటరీతో పాటు సలహా కేంద్రం ఉంటుంది. చేపల పెంపకానికి అవసరమయ్యే నీరు, భూసార పరీక్షలతో పాటు వాటికి ఇవ్వాల్సిన మెడిసిన్, దాణాపై ఈ కేంద్రం ద్వారా అవగాహన కల్పించనున్నారు. క్షేత్ర స్థాయిలో చేపల పెంపకం కేంద్రాలకు వచ్చి సూచనలు, సలహాలను ప్రత్యేక టెక్నీషియన్లు అందిస్తారు. గతంలో చేపలు మృత్యువాత పడిన సందర్భాలు అనేకంగా ఉన్నందున ఈ సెంటర్‌ను వినియోగించుకొనుట ద్వారా చేపలు చని పోకుండా ఉంటాయి. ఈ సెంటర్ తెలంగాణలో మొదటి సెంటర్, మరో పది కేంద్రాలను మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేపల పెంపకందారులతో పాటు సేవలు అందుతాయని చెప్పారు. చేపల పెంపకంకు సంబంధించి పూర్తి వివరాలను అక్వా ఆప్‌లో రికార్డు చేయడం జరుగుతుందన్నారు. చేపల సీడ్ పెంపకం నుంచి చేపల పంటను తీసుకునే వరకు పూర్తి వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాప రవీందర్ రెడ్డి, అంజయ్య, నర్సయ్య, సెంటర్ నిర్వాహకులు వి.కృష్ణమూర్తి, వి.తరుణ్‌తో పాటు రైతులు ఉన్నారు.
గత పాలకుల నిర్వాకంతోనే నాసిరకం పనులు

* మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ టౌన్, జూలై 20: నగరంలో గత పాలకుల నిర్వాకంతోనే గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టారని, ఫలితంగా పలుచోట్ల రహదారులు గుంతలు పడుతున్నాయని మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. శుక్రవార నగరంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా 9వ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షం మూలంగా రోడ్డుపక్క భాగంలో భూమి కుంగి పోయిందని, కింద అంతర్గత మురికి కాలువ ఉండగా, మట్ట్భిర్తీ చేయటంలో ప్రదర్శించిన అలసత్వంతోనే గుంత ఏర్పడిందన్నారు. సంఘటనాస్థలికి మున్సిపల్ అధికారులను పిలిపించి, దగ్గరుండి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. నగరంలో అన్ని డివిజన్ల రోడ్లు, మురికి కాల్వలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. వర్షాకాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మేయర్ వెంట కార్పోరేటర్ గొట్టిముక్కుల ఉమరమణ, స్థానిక నాయకులు ఉన్నారు.