కరీంనగర్

రాజుల సొమ్ము రాళ్లపాలు నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికల్, ఏప్రిల్ 24: 50యేళ్ల ఘన చరిత్రలో నాడు రాజుల సొమ్ము రాళ్లపాలవుతుంటే నేటి తెలంగాణలో టిఆర్‌ఎస్ పాలనలో ప్రతి పైసా పేదల పాలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని అల్లీపూర్ ఎగ్గెల్ చెరువు మరమ్మతు పనులు ఆయన ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ. 38.50లక్షల వ్యయంతో తలపెట్టిన చెరువు మరమ్మతు పనులు ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమస్తదీ అనే వారికి ప్రభుత్వం చేపడుతున్న పనులు చక్కని నిదర్శనమన్నారు. నాడు ఎండా కాలంవస్తే రోజులో 6గంటలైనా కరెంట్ ఉండేది కాదని కాని మన తెలంగాణ లో ఈ కరవు పరిస్థితుల్లో కూడా కరెంట్ సక్రమంగా ఇస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. తెలంగాణలో రైతన్నలు రాత్రిపూట వ్యవసాయ పనులకు పోవద్దని ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని ఉద్దేశంతో రైతులకు 9గంటల కరెంట్ పొద్దునే ఇస్తున్నామని, నాడు పేదలకు పంపిణీ చేసే బియ్యం తలా 4కిలోలు ఉంటే కెసిఆర్ తలా 6కిలోలు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాల లల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. ఇదే అల్లీపూర్‌లో ఒకప్పుడు కేవలం 600 పింఛన్లు ఉంటే ప్రస్తుతం బీడీ కార్మికులతో సహా 1300పింఛన్లు ఉన్నాయని ముఖ్యంగా పింఛన్ల విషయంలో జోగినులు, ఇంటిపై ఉన్న ఆడ పడుచుల కోసం పింఛన్లు అందేలా కృషి చేస్తామని ఇలాంటి వారందరికీ కొద్ది రోజుల్లో పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ఈగ్రామంలోని 2 చెరువులకు రూ. 90లక్షలు మంజూరు చేశామని ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఏ ప్రభుత్వమైనా మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు. వచ్చే మూడేళ్లలో వ్యవసాయానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పడాల పూర్ణిమ, సర్పంచ్ బాలె శోభ, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ తదితరులున్నారు.