కరీంనగర్

రైతుల అభ్యున్నతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, ఆగస్టు 9: సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతారని రాష్ట్ర సహకార సంఘం అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు అన్నారు. గురువారం ధర్మారం మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన సహకార సంఘం ప్రహరీను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సహకార వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు కేటాయించిందన్నారు. రిజర్వు బ్యాంక్‌కు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు గ్యారంటీ సమర్పించిన తరువాతనే బ్యాం క్‌లు పుంజుకున్నాయన్నారు. ధర్మారం, మేడారం సహకార బ్యాంక్ వంద శాతం వసూళ్లు చేసి నష్టాల్లో ఉన్న బ్యాంక్‌ను చైర్మన్ నర్సింగారావు లాభాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 కోట్లతో ప్రారంభించిన బ్యాంక్ 2500 కోట్లకు చేరిందన్నారు. గత 13 సంవత్సరాల నుండి తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నానని, కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాతనే సహకార వ్యవస్థ బలోపేతమైందన్నారు. దేశంలోనే కరీంనగర్ సహకార బ్యాంక్ ప్రథమ స్థానంలో నిలిచి నీటి ఆయోగ్ ద్వారా ప్రశంసలందుకొందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీప్‌విప్ ముఖ్య అతిథిగా పాల్గొనగా పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు కిచ్చిడి మోహన్ రెడ్డి, మేడారం, ధర్మారం సింగిల్‌విండో చైర్మన్ పూస్కూరి నర్సింగారావు, బ్యాంక్ డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పంటల రక్షణకు సకాల చర్యలు
* పరిశోధనా స్థానం సహసంచాలకుడు ఉమారెడ్డి
ధర్మపురి, ఆగస్టు 9: వివిధ పంటల రక్షణకు సకాల చర్యలు గైకొనాలని ప్రొఫెసర్ జయశంకర్ పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు ఆర్.ఉమారెడ్డి సూచించారు. గురువారం ధర్మపురి మండలంలోని నాగా రం, తుమ్మెనాల గ్రామాలలో వరి, పత్తి, కంది, పసుపు, బీర, మిర్చి, టమాట తదితర పంటలను సహ సంచాలకులు ఉమారెడ్డి, సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పీ.మధుకర్‌రావు, డాక్టర్ ఎస్.ఓం ప్రకాశ్, డాక్టర్ యన్.శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ్ధాకారి పీ.నరేశ్ తదితరులు పరిశీలించారు.వివిధ పంటలరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి శాస్తవ్రేత్తల బృందం సూచనలు చేసింది. వరి పంటలో జింకు లోపం గమనించి, నివారణకు రెండు గ్రాములు జింకు సల్పేట్, లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు వేయాలని సూచించారు. మొక్కజొన్నలో మొగి పురుగు, జింక్‌లోపం కనుగొని, నివారణకు మొక్కజొన్నకు 25-30రోజుల దశలో ఉన్నపుడు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు ఎకరానికి మూడు కిలోలు ఆకుల సుడులలో వేయాలన్నారు.