కరీంనగర్

వాజ్‌పేయి మరణం దేశానికి తీరనిలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 16: దేశ మాజీ ప్రధాని, బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయ్ మరణం దేశానికి తీరనిలోటని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అ న్నారు. ఆయన మరణవార్త తెల్సిన వెంటనే నగరంలోని తెలంగాణ చౌక్ లో శ్రద్ధాంజలి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అటల్ చిత్రపటానికి పూలమాల వేసి, వౌ నం పాటించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం గొప్ప రాజనీతిజ్ఞున్ని కో ల్పోయిందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ఆలోచిస్తూ జీవితాన్ని గడిపారన్నారు. ఆయన మ రణం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, జన్‌సంఘ్ అధ్యక్షుని గా, బీజేపీ వ్యవస్థాపకునిగా, నమ్మిన సిద్ధాంతం కోసం దేశ ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆటుపోట్లు తట్టుకుని కార్యకర్తలకు సూఫర్తిదాయకంగా నిలిచారన్నారు. తన వాక్చాతుర్యంతో పార్లమెంటుకే వనె్నతెచ్చారని, విపక్షాలు సైతం ఆయన వాగ్ధాటిని అభినందిచటమే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే, ఆపార్టీ జిల్లాకార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వాజ్‌పేయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేత బాస సత్యనారాయణరావు, దుబాల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, బండ రమణారెడ్డి, గాజె రమేశ్, శివరామకృష్ణ, పొ న్నం మొండయ్యగౌడ్, సంజిత్‌సింగ్, ముప్పిడి సునీల్, ఎండీ ముజీబ్, శివరాజ్, కచ్చురవి, కలికోట ముఖేష్, మోహన్, ఉప్పరపల్లి శ్రీను, బండ అనిత, తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కురుపితామహులు అటల్‌జీ
ధర్మపురి, ఆగస్టు16: రాజకీయ కు రువృద్ధులు, ఉత్తమ పార్లమెంటేరియ న్, జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ ఇక లేరు. 1924 డిసెంబర్ 25 న గ్వాలియర్‌లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్‌లోనే సరస్వతి శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేసి, విక్టోరియా కళాశాలలో హిందీ, సంస్కృతం, ఆంగ్లభాషలలో పట్ట్భద్రులై, కాన్పూరు దయానంద అంగ్లోవైదిక కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పూ ర్తి చేశారు. ఆర్య సమాజ యువ విభాగంలో సామాజిక కార్యక్రమాలకు శ్రీ కారం చుట్టి, 1939లో ఆర్‌ఎస్సెస్‌లో చేరారు. 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గాగా బాధ్యతలు స్వీకరించారు. సం ఘ్ విస్తారక్‌గా ఉత్తరప్రదేశ్‌లో దీన్‌దయాళ్ నడిపిన రాష్టధ్రర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దిన పత్రికలకు పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, 23 రోజులు జైలుకు వెళ్లారు. 1951లో భారతీయ జనసంఘ్ ఆవిర్భావ సమయాన దీన్‌దయాళ్‌తో కలిసి పనిచేయడానికి నియుక్తులైనారు. 1954లో కాశ్మీర్‌లో ఆమరణ నిరాహార దీక్షలో దీన్‌దయాళ్ వెంట ఉన్నారు. 1957లో బల్రామ్‌పూర్ నుంచి మొదటి సారి లోకసభకు ఎన్నికైనారు. ఆయన వాగ్ధాటికి ఆచ్చెరువొందిన నెహ్రూ ఒకనాడు వాజపేయి దేశ ప్రధాని అవుతారని ఆనాడే ప్రకటించారు. 68లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా బాధ్య త స్వీకరించారు. 1975, 77మధ్య ఎ మర్జెన్సీలో అరెస్టు కాబడినారు. 77లో జయప్రకాశ్ నారాయణ్ ఇచ్చిన పిలుపుమేరకు జనసంఘ్‌ను జనతాపార్టీలో విలీనం చేశారు. 79లో మొరార్జీ ప్రభుత్వం కూలిపోగా, వాజ్‌పేయి, జనసంఘ్, ఆరెస్సెస్ లోని తమ సహచరులతో భారతీయ జనతా పార్టీకి అంకురార్పణ గావించారు.