కరీంనగర్

రాహుల్ పర్యటనతో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, ఆగస్టు 16: పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని వేములవాడ ఆలయ మాజీ చైర్మన్, ఆ పార్టీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని రాహుల్‌జీ మాట్లాడడం అభినందించదగ్గ విషయమన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, స్వశక్తి మహిళలకు వడ్డీ లేకుండా, ఉచితంగా లక్ష రూపాయల రుణం, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తామని కాంగ్రెస్ మెనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, చెలకల తిరుపతి, మాడిశెట్టి అభిలాష్, ఎర్రం నర్సయ్య, దావాల గంగాధర్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
* టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 16: సమైక్య పాలనలో ఏనాడు తెలంగాణ అభివృద్ధిపట్ల ఆలోచించక, పదవులే పరమావధిగా బతికిన కాంగ్రెస్ నేతలకు మళ్ళీ గుణపాఠం తప్పదని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ధ్యేయం గా ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతూ, అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆరోపించారు. నాడు స్కామ్‌ల కోసమే స్కీములు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని, ప్రజాభివృద్ధికోసమే సంక్షే మ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమదన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వాస్తవాలు తెల్సుకుని మాట్లాడాలని, తెలంగాణపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి అవాస్తవాల స్క్రిప్టు ఇచ్చి, పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సస్యశ్యామలంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందని, తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుండగా, అనేక కేసులు వేస్తూఅభివృద్ధి అడ్డుకునే కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ సహించబోరన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌లు ధ్యావ మధుసూదన్ రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్, విద్యార్థి నాయకులు రామడుగు రాజేశ్, తిరుపతినాయక్, కెమసారం తిరుపతి, ఫహాద్, బొంకూరి మోహన్, చుక్క శ్రీనివాస్, అంజి, కత్తి శ్రీనివాస్, ప్రవీన్, అనంతరెడ్డి, సందీప్, శేఖర్‌బాబు, సాయిక్రిష్ణ , తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ గర్జనతో కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం
గోదావరిఖని టౌన్, ఆగస్టు 16: హైదరాబాద్‌లో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరుద్యోగ గర్జనతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం వచ్చిందని ఐఎన్‌టీయుసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బడికెల రాజలింగం తెలిపారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గర్జనతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టామని, రానున్న ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను రెట్టింపు చేస్తామని, 15లక్షల మంది నిరుద్యోగులకు ప్రతి నెల 3వేల రూపాయల జీవన భృతి కల్పిస్తుందని చెప్పారు. నిరుద్యోగ గర్జన కార్యక్రమ విజయవంతం చేసిన వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, ధర్మపురి, ఎం.రవి కుమార్, సతీష్ గౌడ్, విజయ్ మోహన్, ప్రసన్న కుమార్, గడ్డం శేఖర్, లక్ష్మిపతి గౌడ్, వడ్డెపల్లి దాస్, ఎస్.లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఆహారభద్రత దరఖాస్తులను పరిష్కరించాలి
* రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్
పెద్దపల్లి, ఆగస్టు 16: ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెం టనే పరిశీలించి అర్హులను దృవీకరించాలని, అర్హత గల వారి దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్‌తో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండవ దశ బి య్యం పంపిణీకై టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిగా చేయాలని, అధికారులు ఎప్పటి కప్పుడు ఎస్‌సీఎం ఎంట్రీస్ నమోదు చేసి స్టాక్ ఇష్యూ చేయాలని తెలిపారు. సీఎంఆర్ డెలివరీ పర్సేంటేజ్, యాసంగిలో వరి ధాన్యం కోనుగోల్లు వివరాలను రికన్సైల్ చేసుకోవాలని అధికారులకు తెలిపారు. డిసెంబర్-17 వరకు కెపిఈఎఫ్ వద్ద ఉన్న బకాయిలు వసూళ్లు చేయాలని, జనవరి నుండి జూలై-2018 వరకు కెపిఈఎఫ్ ఖాతాల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారులు రేషన్ షాపులను క్షేత్రస్థాయిలో తనీఖీలు చేయాలని, ఈపాస్ యంత్రాల పనితీరును పరిశీలించి ఎమైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆహార భధ్రత కార్డుల దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించాలని, అర్హుల ఎంపికలో పారదర్శకంగా ఉండాలని ఆయన తెలిపారు. పౌరసరఫరాల కార్పొరేషన్ నిర్మిం చే పేట్రోల్ బంక్‌లకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జేసీ వనజాదేవికి కమీషనర్ తెలిపారు. అనంతరం జేసీ వనజాదేవి మాట్లాడుతూ జిల్లాలో 5వేల ఆహారభధ్రత కార్డుల దరఖాస్తులను దృవీకరించామని, ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోలుకు అవసరమైన కార్యచరణ రూపొందించడానికి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడానికి బందంపల్లి, బ్రాహ్మణపల్లిలో భూములను గుర్తించామని తెలిపారు. రేషన్ షాపులను అకస్మిక తనీఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతినెలా రూ.10 లక్షల బకాయిలను రికవరి చేస్తున్నామని జేసీ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రెహ్మన్, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ అభిషేక్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.