కరీంనగర్

ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 20: విద్య ప్రమాణాల మెరుగు కోసం త్వరలో పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ ఎనేబుల్డ్ బయో మెట్రిక్ అటండెన్స్ సిస్టం విధానం (ఎఇబీఎఎస్) ప్రవేశ పెడుతున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వ ర్ రావు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్ పాఠశాలలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సముదాయంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శా తం పెంచడానికి, ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టకుండా ఉండటానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మధ్యాహ్న భోజనం అమలు, పాఠ్యపుస్తకాలు, యూని ఫాంల పంపిణీ సక్రమంగా కొనసాగడానికి బయో మెట్రిక్ ఉపకరిస్తుందన్నారు. ఇప్పటికీ బయో మెట్రిక్ అమలు గురించి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్టు ఆయన చెప్పా రు. జిల్లాలో 100 జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలు, నాలుగు ప్రభుత్వ ఉన్న త పాఠశాలలు, 58 ప్రాథమికోన్నత పాఠశాలు, 357 ప్రాథమిక పాఠశాలలు, 10 కస్తూర్బా పాఠశాలలు, ఏడు మోడల్ పాఠశాలలు ఉండగా, 2371 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన వివరించారు. బయోమెట్రిక్ విధానం టీచర్లు, విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని, దీంతో పాఠశాల విద్యలో సమూల మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాలువపై సైఫాన్ నిర్మించాలి
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి
రామడుగు, ఆగస్టు 20: మండలంలోని చిప్పకుర్తి శివారు మీదుగా వెళ్లిన కాళేశ్వరం 8వ ప్యాకేజీ కాలువపై సైఫాన్ నిర్మించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రైతులు, కార్యకర్తలతో కలిసి ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్ధిపేటకు నీటిని తరలించాలని కుయుక్తులో భాగంగానే కాలువపై నుండి వెళ్లే నీటికోసం నిర్మించాల్సిన బ్రిడ్జిని రెండు మీటర్ల ఎత్తులో నిర్మించి ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అదికారులు ఈ విషయాన్ని గుర్తించి వరద నీరు వెళ్లే విధంగా సైఫాన్‌ను కింది స్థాయిలో నిర్మాణం చేసి చిప్పకుర్తి చెరువులోకి నీరు వెళ్లే విధంగా పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయ న వెంట పార్టీ మండల అధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్, పూరెళ్ల గోపాల్ గౌడ్, సయ్యద్ ముస్తాక్, నేరెళ్ల వెంకటేషం, పూరెళ్ల మనోజ్, తదితరులు ఉన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం
* టీజేఎస్ జిల్లా కన్వీనర్ చుక్క గంగారెడ్డి
జగిత్యాల, ఆగస్టు 20: రాష్ట్రంలో ప్రజాసమస్యలపై పోరాటమే లక్ష్యం గా జనసమితి కృషి చేస్తున్నదని టీజేఎస్ జిల్లా కన్వీనర్ చుక్క గంగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల వాసవి స్కూల్‌లో సోమవారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామగ్రామాన గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను సేకరించి, పరిష్కారమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో అనుబంధ సంఘాలుగా విద్యార్థి, యువజ న, మహిళా జనసమితిలను నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు, యువత, మహిళలు, మైనార్టీలు తరలివచ్చి జన సమితిలో చేరి బాధ్యతలు చేపట్టి ఉద్యమంలో కలిసి రావాలన్నా రు. గ్రామాల్లో పాలనాధికారుల పరిపాలన ప్రజలకు అందడం లేదని ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతుబంధు, భూ సమస్యలను సంబంధిత తహశీల్దార్ల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని జన సమితి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 5,6 గ్రామాలకు ఒక కార్యదర్శి ఉండడం వల్ల అనేక సమస్యలు పెరిగిపోతున్నాయని అ న్నారు. జిల్లా కో-కన్వీనర్లు అల్లెంకి శ్రీనివాస్, తోడేటి అశోక్‌గౌడ్, జిల్లా నా యకులు కంతి మోహన్‌రెడ్డి, నాగుల రమేష్, మహిపాల్, వివిధ మండలాల కన్వీనర్లు గడప చంద్రశేఖర్‌రావు, ఎండీ అజారొద్దీన్, వనతుపుల నాగరాజు, గడ్డం మహిపాల్‌రెడ్డి, ఆర్‌కె నాని, కృష్ణ, ఎల్క కమలాకర్, గొల్లపల్లి రాయమల్లయ్య, పులి రవి, సత్యంగౌడ్, నరేష్, అనిల్ పాల్గొన్నారు.