కరీంనగర్

క్యాటరాక్ట్ శస్తచ్రికిత్సలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 20: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం కింద గ్రామాల్లో కంటి పరీక్షల అనంతరం శస్తచ్రికిత్సలు అవసరమైన వారికి, అధికారులు గుర్తించిన కంటి ఆస్పత్రుల్లో మాత్రమే నిర్వహించాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం సాయం త్రం కలెక్టరేట్‌లోసంబంధిత వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంటి వెలుగు కాటరాక్ట్ శస్తచ్రికిత్సలు నిర్వహించేందుకు జిల్లాలో రేకుర్తి కంటి ఆస్పత్రి, ప్రతిమ, చల్మెడ ఆస్పత్రుల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ తయారుచేయాలని సూచించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఉమ్మడి జిల్లా పరిధిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రజలకు కూడా వీటిలోనే శస్తచ్రికిత్సలు నిర్వహించాలన్నారు. రేకుర్తి కంటి ఆస్పత్రిలోసిరిసిల్ల,కరీంనగర్ జిల్లాలకు చెందినవారికి, చల్మెడ ఆస్పత్రిలో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందినవారికి, ప్రతిమ ఆస్పత్రిలోకరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన వారికి శస్తచ్రికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు అందజేస్తున్నట్లు, గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షలు పూరె్తైన వెంటనే రెఫరల్ ఆస్పత్రుల వైద్య బృందం వెళ్ళి శస్తచ్రికిత్సలు అవసరమైన వారిని గుర్తించి, ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటివిడత కొన్ని గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తికాగా, ఆయా గ్రామాలకు రెఫరల్ ఆస్పత్రుల వైద్య బృందాలు వెళ్ళి శస్తచ్రికిత్సలు ఆరంభించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో డా.సుజాత, డా.అనంతరెడ్డి, డా.జగన్‌మోహన్‌రావు, డా.రత్నమాల, తదితరులు పాల్గొన్నారు.

మామపై అల్లుడి దాడి
* చికిత్స పొందుతూ మృతి
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 20: కుటుం బ కలహాలతో మామపై అల్లుడు దాడి చేయడంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మామ మృతిచెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌కు చెందిన మామ బండారు సత్యనారాయణపై అల్లుడు యెలిగేటి మహేందర్ ఆదివారం దాడి చేయగా చికిత్స పొందుతూ మామ సత్యనారాయణ మృతి చెందాడు. కాగా ఏడాదిన్నర క్రితం బండారు సత్యనారాయణ కూ తురు నిఖితను సందరయ్యనగర్‌కు చెందిన యెలిగేటి మహేందర్‌కు వివాహం చేయగా ఇటీవల నిఖిత పాపకు జన్మనిచ్చింది. ఆదివారం పాపను తన ఇంటికి మహేందర్ తీసుకపోగా తల్లి గారింటికి తెచ్చుకునేందుకు పాపకోసం తండ్రి, తల్లితో నిఖిత వెళ్లగా గొడవకు దారితీసింది. ఈ గొడవలో పరస్పర దాడులు చేసుకోగా మామ సత్యనారాయణపై అల్లు డు మహేందర్ దాడి చేయగా బలమైన గాయాలైన సత్యనారాయణ కుటుంబీకులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఇరువర్గాలకు కౌనె్సలింగ్ నిర్వహించి పాపను తల్లి వద్దనే ఉంచాలని తరువాత విషయాలపై పెద్దల సమక్షంలో నిర్ణయా లు తీసుకోవాలంటూ తెలిపారు. పా పను తీసుకుని నిఖిత తల్లిదండ్రులయిన సత్యనారాయణ ఇంటికి ఆదివారం వెళ్లింది. సత్యనారాయణ అర్ధ రాత్రి సమయంలో అస్వస్థతకు గురి కావడంతో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి సోమవారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మధ్యాహ్నం మృతిచెందారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మహేందర్‌తో పాటు కు టుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

ముంపు గ్రామాలుగా ప్రకటించాలి
* రాష్ట్ర కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం
గంగాధర, ఆగస్టు 20: నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నారాయణపూర్, చర్లపల్లి, మంగపేట గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నారాయణపూర్ చెరువును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గానికి సాగు, తాగునీటిని అందించే నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా మూడు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యె పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కలెక్షన్లు, కమీషన్లు తప్పా ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోని టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం జలసమాధి కాక తప్పదని ఆయన హెచ్చరించారు. నారాయణపూర్ జలాశయం ముంపు గ్రామాలు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వారం రోజుల్లో ముంపు గ్రామాలుగా ప్రకటించకపోతే గంగాధర చౌరస్తా వద్ద మూడు గ్రామాల ప్రజలతో రహదారిని దిగ్బంధం చేస్తామని, అప్పటికీ స్పందించకపోతే వేల మందితో కరీంనగర్ కలెక్టరేటును ముట్టడిస్తామని అయినా ప్రభుత్వం స్పందించకపోతే మూడు గ్రామాల ప్రజలతో సామూహిక ఆమరణ దీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కొలిపాక స్వామి, బాబు గౌతం, కోల ప్రభాకర్, గుర్రం రాము, రామడుగు మల్లేశం, గ్రామస్థులు పాల్గొన్నారు.