కరీంనగర్

హుజూరాబాద్ ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 20: హుజూరాబాద్ ఎంపీపీ వొడితల సరోజినిదేవిపై అవిశ్వాసం సోమవారం వీగిపోయింది. మెజారిటీ ఎంపీటీసీలు మొదట ఎంపీపీ సరోజిని దేవిపై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. కానీ రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ సతీమణి కావడంతో ఈ విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. అవిశ్వాసానికి దరఖాస్తు చేసిన వారిలో టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు. ఇచ్చిన నోటీసు ప్రకారం అధికారులు అవిశ్వాసం పై మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేయగా .. వీగిపోయింది. దీనికి ఎంపీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు ఆర్డీవో బోయపాటి చెన్నయ్య ప్రకటించారు. కాగా దీనిపై మంత్రి ఈటల రాజేందర్ కూడా పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో, ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడంతో వెంటనే అప్రమత్తమైన మంత్రి సీనియర్ నాయకులను రంగంలోకి దించారు. మంత్రి ఆదేశాల మేరకు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ఎడవెల్లి కొండల్‌రెడ్డి, గోపు కొమురారెడ్డిలు రంగంలోకి దిగి ఎంపీటీసీలతో చర్చలు జరిపి వారు.. అవిశ్వాసానికి దూరంగా ఉండేలా వ్యూహం చేశారు. దీంతో అవిశ్వాసం వీగిపోయి రాజకీయంగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎంపీపీగా సరోజినిదేవి పూర్తి కాలం కొనసాగనున్నారు.

విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
బోయినిపల్లి, ఆగస్టు 20: బోయినిపల్లి మండలం స్థంభంపెల్లి గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై సుంకరి పెద్ద బాలయ్య (50) మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..స్థంభంపల్లి గ్రామానికి చెందిన బాలయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లాడు. పొలం పనులు చేస్తుండగా మక్కజొన్న పంటను అడవి పందుల నుంచి కాపాడడానికి విద్యుత్ వైర్లతో ఫెన్సింగ్‌కు విద్యుత్ కనెక్షన్ ఉండడంతో వైర్లు చేతికి తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన బాలయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా బాలయ్య మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి
* మాజీమంత్రి శ్రీధర్ బాబు
మంథని, ఆగస్టు 20: కాంగ్రెస్ పాలనలోనే మంథని నియోజకవర్గం అభివృద్దిని సాధించిందని మాజీమంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం మంథనిలోని ఆయన నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ త్యాగం వల్లే తెలంగాణ ఏర్పడిన సంగతి తెలుసుకొవాలని హితవు పలికారు. అనంతరం మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 74వ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకలు కొత్త శ్రీనివాస్, శశిభూషన్ కాచే, ముత్తారం జడ్పీటీసీ సదానందం,మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పోలు శివ, ఆజీంఖాన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

జావెలిన్ త్రోలో ఆదర్శ పాఠశాల విద్యార్థికి బంగారు పతకం
ధర్మారం, ఆగస్టు 20: రాష్టస్థ్రాయి అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి పోటీల్లో ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని ఎ.రాజేశ్వరి జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించింది. అండ ర్-18 పోటీలు ఈ నెల 18, 19న హైదరాబాద్‌లోని గడ్చిబౌలీ స్టేడియంలో జరిగింది. ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాజేశ్వరి పథకాన్ని సాధించగా పాఠశాల ప్రిన్సిపాల్ దీన, ఫిజికల్ డైరెక్టర్ డీ.కొమురయ్య విద్యార్థినిని సోమవారం ప్రత్యేక సమావేశంలో అభినందించారు.