కరీంనగర్

స్వచ్ఛసర్వేక్షణ్ సక్సెస్ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 20: జిల్లాలో పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పునరంకితమై పనిచేసి స్వచ్ఛసర్వేక్షణ్‌ను సక్సెస్ చేద్దామని కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమె న జగిత్యాల ఐఎంఏ హాల్‌లో స్వచ్ఛసర్వేక్షణ్‌పై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య మాసోత్సవాల్లో భాగంగా స్వచ్ఛసర్వేక్షణ్ విజయవం తం చేసి రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందు కు మున్సిపల్ కమిషనర్లు, పట్టణ మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్లు, ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్లు ఇతరశాఖల అధికారులు స్వచ్ఛసర్వేక్షణ్ విజయవంతం చేసేందుకు చెత్తాచెదారం లేకుండా మురికి కాల్వల్లో మురుగునీరు ప్రవహించకుండా దుర్గంధం వెధజల్ల కుండా, రోడ్లపై చెత్తాచెదారాన్ని వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పునరంకితమై పని చేయాలని కలెక్టర్ సూచించారు. సక్సెస్ చేయడానికి అన్నిశాఖల అధికారులు, సిబ్బం ది సమన్వయంతో పనిచేస్తూ పారిశుద్ధ్య మాసోత్సవాలను దిగ్విజయం చేయ డానికి కృషి చేయాల్సిందేనన్నారు. డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్ టౌన్, ఆగస్టు 20: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బస్ డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల బస్ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు భీమగోని శ్రీనివాస్‌గౌడ్, కె.బుచ్చన్న కోరారు. ఈమేరకు సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు రో జురోజుకు పెరుగుతుండగా, వాటికనుగుణంగా విద్యాసంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నగరం స్మార్ట్‌సిటీగా రూ పాంతరం చెందుతుండగా, ఇంటి అద్దెలు పెరిగి, కుటుంబాలు గడవటం కష్టం గా మారిందని, వేలాది మంది పిల్లలను సురక్షితంగా చేరవేస్తున్న డ్రైవర్ల,క్లీనర్ల సమస్యలు దుర్భరంగా మారాయన్నారు. యాజమాన్యాలు వెంటనే గుర్తించి డ్రైవర్లు, క్లీనర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లతో పాటు, గుర్తింపుకార్డులు, పిఎఫ్, బోనస్‌తో పాటు కార్మికుల పిల్లలకు ఇద్దరికి ఉచిత విద్య అందించాలని కోరా రు. అకారణంగా కార్మికులను తొలగిస్తే 12మాసాల వేతనం ఇవ్వాలని, విధుల్లో ఉండగా ప్రమాదాలు సంభవిస్తే యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డిసిఎల్‌ను కలిసినవారిలో సంఘ నాయకులు గడప యాదగిరి, బుర్ర వేణుగౌడ్, గందం భాస్కర్, బుర్ర ఆంజనేయులు, సింగిరెడ్డి మహేందర్‌రెడ్డి, కొమిరె రాజారాం, మాచర్ల శ్రీ్ధర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.