కరీంనగర్

ప్రశాంతంగా కానిస్టేబుల్ రాత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 24: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు (సివిల్/ఎఆర్/టిఎస్‌ఎస్‌పి/ఎస్‌పిఎఫ్/ ఎస్‌ఎఆర్‌సిపిఎల్/ఎస్‌ఎఫ్‌ఓ) అభ్యర్థుల ఎంపికలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం నిర్వహించారు. జిల్లాలో 55,176 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 51,392 మంది అభ్యర్థులు పరీక్ష రాసారు. 3,784 మంది అభ్యర్థులు గైర్హాజర్ అయ్యారు. జిల్లా కేంద్రంతోపాటు మంథని, జగిత్యాల, హుజురాబాద్, పెద్దపల్లి పట్టణాలలో మొత్తం 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. పరీక్ష కేంద్రాల్లోకి ఒక గంట ముందుగానే అనుమతించగా, సమయం దాటిన తరువాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించలేదు. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 నిషేదాజ్ఞలను అమలు చేశారు. జిరాక్స్ సెంటర్‌లను మూసి వేయించారు. జిల్లాలో కానిస్టేబుల్ రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, 93.14శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరై పరీక్ష రాసారని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.