కరీంనగర్

డాక్టర్ లేడు.. కరీంనగర్‌కు తరలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 24: ఓ మహిళ పురిటి నొప్పులతో జగిత్యాల ప్రాంతీయ వైద్యశాలకు ప్రసవం కోసం 108 అంబులెన్స్‌లో రాక ఆ దవాఖానలో గైనకాలాజిస్టు వైద్యురాలు లేదని కరీంనగర్‌కు వెళ్లాలని సిబ్బంది సూచించడంతో వెంటనే 108 సిబ్బంది తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే అంబులెన్స్‌లో ప్రసూతి అయిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మల్యాల మండలం లంబాడీపల్లి గ్రామానికి చెందిన అంజలి అని 108అంబులెన్స్‌లో జగిత్యాల ప్రాంతీయ వైద్యశాలకు తీసుకురాగా గైనకాలాజిస్టు అందుబాటులో లేదని కరీంనగర్ రెఫర్ చేయగా జగిత్యాల 108అంబులెన్స్ సిబ్బంది కరీంనగర్‌కు అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో కొండగట్టు సమీపంలో ప్రసూతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరుకే పెద్ద ఆసుపత్రి గైనకాలాజిస్టు అందుబాటులో లేకపోవడం విచారకరమని, డ్యూటీ డాక్టర్ స్పందించలేదని అంజలి భర్త శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి వైద్య సిబ్బందిపై తగు చర్య తీసుకొని ఇలాంటి సంఘటన మరో మహిళకు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కాగా 108సిబ్బందిని అంజలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు అభినందించారు.