కరీంనగర్

అకాల వర్షం.. అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, ఏప్రిల్ 26: మండలంలో మంగళవారం అకాల వర్షానికి 200 ఎకరాలలో వరి పంట నష్టం అయింది. మండలంలోని మామిడిపల్లి, బావుసాయిపేట, వట్టిమల్ల, మర్రిమడ్ల, వెంకట్రావుపేట, కొండాపూర్, నిమ్మపల్లి, కోనరావుపేట గ్రామాల్లో వడగళ్ళ వర్షం పడడంతో చేతికి వచ్చిన పంట నేల రాలింది. ఐకెపి కేంద్రాల వద్ద పోసిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. అప్పులు చేసి వరి పంట వేసిన రైతులు అకాల వర్షానికి వడ్లు నేల రాలడంతో రైతులు కన్నీరు మున్నీరు కారుస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలని బాధితులు, ప్రజాప్రతినిథులు కోరుతున్నారు.
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంతంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. ఈ సందర్భంగా ఈదురు గాలులు తీవ్రంగా వీచాయి. అకారణ వర్షాలలో తంగళ్ళపల్లిలో జరిగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మండలంలోని పలు గ్రామాలలో కురిసిన వర్షాలకు ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి నష్టాలకు గురైనట్టు తెలిసింది. ఇటీవలే మండలంలోని సమారు పది కేంద్రాలలో కొనుగోలు ప్రారంభించగా, రైతులు తమ ధాన్యం నిలువలను విక్రయించడానికి తీసుకరాగా, తూకానికి సిద్దంగా ఉన్న వరి ధాన్యం తడిసి పోయినట్టు సమాచారం అందింది. అయితే పూర్తి వివరాలు అందాల్సి ఉంది.