కరీంనగర్

గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 19: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి గోదావరి నది వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్టు బల్దియా కమిషనర్ భువనగిరి శ్రీనివాస రావు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించి గణపతి విగ్రహాలను ఆయా ప్రాంతాల నుంచి గోదావరి నదికి తరలించే దారి పొడవునా ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా, రహదారి ప్రాంతాల్లో ప్రతి కూడళ్ల వద్ద ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నిమజ్జనానికి తరలి వెళ్లే భక్తులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా రహదారిపైన తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గోదావరి నది వద్ద ప్రత్యేక రెస్క్యూ టీం ఉంచానున్నామని, వైద్య ఆరోగ్య శాఖచే ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. బుధవారం గోదావరి నది వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల పనులను పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, గోదావరిఖని ఏసీపీ రక్షిత కే. మూర్తి పర్యవేక్షించారు. రామగుండం అర్బన్ ప్రాంతాలతో పాటు అంతర్గాం, రామగుండం రూరల్ ప్రాంతాల్లో నిమజ్జనానికి సంబంధించిన గోదావరి నది వద్ద ఏర్పాట్లను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, సీఐలు వాసుదేవ రావు, వెంకటేశ్వర్లు, రమేష్ బాబుతోపాటు సింగరేణి, కార్పొరేషన్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

మీ ఆశీర్వాదమే నాకు కొండంత అండ
* కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే గంగుల
* టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిక
కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 19: మీ ఆశీర్వాదమే నాకు కొండంత అండ అని, నాపై నమ్మకంతో 20 సంవత్సరాలుగా గెలిపించినందుకు రుణపడి ఉం టానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి మండలం సీతరాంపూర్‌లోని ఈఎన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశం లో బీజేపీ, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 300 మందికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గంగుల మాట్లాడు తూ 20 సంవత్సరాల క్రితం కౌన్సిలర్‌గా రాజకీయ భిక్ష పెట్టి కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోనే కరీంనగర్ నియోజకవర్గంను ముందు వరుసలోకి తీసుకువచ్చానన్నారు. ప్రతి గ్రామం నుంచి మం డల కేంద్రంకు లింకు రోడ్డు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించామని తెలిపారు. కేవలం మూడు నెలల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందనున్నాయని, ఉమ్మడి కరీంనగర్ మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అందుతున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌తోనే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన జిల్లా, మండల నేతలు తాళ్లపల్లి ఎల్లాగౌడ్, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో పార్టీలో కి వచ్చారని తెలిపారు. కో ఆప్షన్ సభ్యుడు జమీల్, జడ్పిటీసీ శ్రీనివస్, ఎంపిపి వాసాల రమేష్, ఎంపీటీసీ తుల బాలయ్య, మాజీసర్పంచులు సాగర్, మల్లయ్య, కిష్టయ్య పాల్గొన్నారు.

సుధాకర్‌కు ఘన సన్మానం
జగిత్యాల, సెప్టెంబర్ 19: ముంబాయి ఆంధ్ర మహాసభ ఎన్నికల్లో రెండో సారి నిలిచి గెలిచి తెలుగోడి సత్తా చాటిన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సంకు సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. పద్మశాలి ఇంజనీయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు హైదరాబాద్‌లో ముంబాయి ఆంధ్ర మహాసభ, జింఖానాకు నూతన అధ్యక్షునిగా రెండోసారి గెలిచి తెలుగోడి సత్తాచాటిన సంకు సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, తెలంగాణ వెనకబడ్డి తరగతుల కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు, తెలంగాణ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొని ఆంధ్రా మహాసభ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సంకు సుధాకర్‌ను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానం ఆంధ్ర మహాసభ జీవిత సభ్యులందరికీ అంకితమని, తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర మహాసభకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సహాయ సహకారాలు తీసుకుంటామని, తెలుగేతర రాష్ట్రాల నుంచి తెలుగు భాషా, సాహితీ, సంస్కృతుల పరిరక్షణకు కట్టుబడిఉంటానని సంకు సుధాకర్ వెల్లడించారు.