కరీంనగర్

ఓటరు నమోదు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, సెప్టెంబర్ 23: ఓటరు నమోదు ప్రక్రియను ఇంటింటా సర్వే చేసి వె ంటనే పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. ఆదివారం గంగాధర తహశీల్ కార్యాలయాన్ని సందర్శించి డాటా ఎంట్రీ రిజిష్ట్రార్, అలాగే ఓటరు నమోదు ప్రక్రియ, కంప్యూటర్ ఆపరేటర్ల పనితీరును ఆయన పరిశీలించారు. ఎన్నికల కమీషనర్ నిర్ధేశించిన లక్ష్యంమేరకు ఓటర్ల సంఖ్యను కొత్తగా చేర్చే ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించారు. మండలంలో చనిపోయిన ఓటర్ల జాబితాలో తొలగింపు, 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల వివరాలు, వాటి రిజిష్ట్రార్లను తహశీల్దార్ సరిత ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మండల ంలో రిజిష్టర్ అయిన 766 ఓటర్లు మరణించిన వాటిని జాబితానుండి తొలగించ డం జరిగిందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, బూత్ లెవల్ అధికారుల ద్వారా 25 లోపు పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు. వీరివెంట ఆర్‌ఐ కనకరాజు, రహీ ం, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

మంత్రి ఈటలకే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ
ఇల్లందకుంట, సెప్టెంబర్ 23: మండలంలోని సిరిసేడులో వివిధ కుల సం ఘాల నాయకులు టిఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే ఓటు వేస్తామని ఆదివా రం ప్రతిజ్ఞ చేశారు. మండల కేంద్రాభివృద్దికి రూ. 88 లక్షల నిధులను కేటాయించడంతోపాటు, అంతర్గత రహదారుల నిర్మాణాలకు కృషిచేశారన్నారు. కార్యక్రమ ంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బినవేణి మహిపాల్ యాదవ్, యూత్ అధ్యక్షులు జువ్వాజి కుమార్, మాజీ సర్పంచ్ బుర్ర రమేష్, కుల సంఘాల అధ్యక్షుడు చంద్రవౌళి, కుమార్, దుర్గయ్య, రాజు, సదయ్య, భద్రయ్య, దేవేందర్‌లతో పాటు తదితరులున్నారు.
పీసీసీ ప్రెసిండెంట్‌ను కలసిన ఆది
వేములవాడ, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆదివారం సీనియర్ నాయకులు ఆదిశ్రీనివాస్ కలుసుకున్నారు. ని యోజకవర్గ పరిస్థితి గురించి ఆయన వివరించారు. అంతకుముందు కార్యనిర్వహాక అధ్యక్షులుగా నియామకమైన పొన్నం ప్రభాకర్‌ను, రేవంత్‌రెడ్డిని ఆయన కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి
చందుర్తి, సెప్టెంబర్ 23: 18 సం.లు నిండిన యువతీ, యువకులు ఈనెల 25 తేదీలోపు ఓటుహక్కును నమోదు చేసుకోవాలని చందుర్తి తహశీల్దార్ నరేష్ అన్నారు. మండలంలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. 18 ఏళ్లు నిండినవారు తప్పకుండా ఓటుహక్కును నమోదు చేసుకోవాలన్నారు.