కరీంనగర్

రామగుండం మున్సిపాలిటి పార్కు పేరుతో అరకోటి దుబారా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, ఏప్రిల్ 28: రామగుండం మున్సిపాలిటి నిధుల దుబారాకు నిదర్శనంగా నిలుస్తుంది. 2008వ సంవత్సరంలో గోదావరిఖనిలో పబ్లిక్ పార్క్ నిర్మాణం పేరిట అరకోటి రూపాయలను దుబారా చేసింది. ఆర్భాటంగా పనులను అయితే ప్రారంభించి తూతూ మంత్రంగా చేపట్టి అక్కడ పనులన్ని గాలికి వదిలేసారు. దీంతో ఆ ప్రదేశమంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. మున్సిపాలిటి నుంచి కార్పొరేషన్ స్ధాయికి అప్ గ్రేడ్ అయి ఇటీవలనే పట్టణ అభివృద్ధి సంస్థ జాబితాలో చేరుతున్న రామగుండం నగర పాలక సంస్ధ పరిధిలో ఒక్క పబ్లిక్ పార్క్ నిర్మాణం చేయకపోవడం అనేక విమర్శలకు తావిస్తుంది. 2008వ సంవత్సరంలో అప్పటి మున్సిపల్ చైర్మన్ బడికెల రాజలింగం కోటి రూపాయలతో గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన పబ్లిక్ పార్క్ ఏర్పాటు కోసం 5 ఎకురాల స్ధలంలో కౌన్సిల్ అనుమతిని పొంది, రూ.68 లక్షలకు టెండర్లను పిలిచి పనులను మొదలు పెట్టారు. పార్క్‌లో బోటింగ్ కోసం కొలను ఏర్పాటు కోసం సుమారు రూ.4లక్షల వ్యయంతో రూపొందించిన ఎతైన శివుడి విగ్రహాం ఏర్పాటు, మట్టి తరలించి చదును పనులు చేపట్టినప్పటికి అదికాస్త అర్ధంతరంగానే ఆగిపోయింది. ఈ పనులన్నింటి నిర్వాహణకు రూ.50 లక్షల వరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయి. కానీ పార్క్ నిర్మాణం మాత్రం పూర్తికాకుండా తుమ్మ పొదలు దర్శనమిస్తున్నాయి. గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పార్క్ నిర్మాణ ప్రదేశాన్ని కలెక్టర్ సందర్శించి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఆ మాటలన్ని బేఖాతరయ్యాయి. అరకోటి రూపాయల బిల్లులు చెల్లింపులు జరిపినా, ఆ తర్వాత మిగులు పనులను పూర్తి చేయాలన్న ఆలోచన కూడా నగరపాలక సంస్ధ అధికారులకు గానీ, పాలక పక్షానికి గాని గుర్తుకు రాకపోవడం విచారకరం. అందినకాడికి కమీషన్లను దండుకొని పార్క్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఇక్కడ నిత్యం వినిపిస్తున్నాయి. కొత్తగా పాలక పక్షం బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా ఆగిపోయిన పబ్లిక్ పార్క్ పనులను ఎందుకు పునప్రారంభించడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. రామగుండం కార్పొరేషన్‌లో నిధులు పుష్కలంగా ఉన్నా.. పాలక పక్షం నిండుగా ఉన్నా.. ఇక్కడ పబ్లిక్ పార్క్ ఏర్పాటులో ఎందుకు శ్రద్ధ కనపరచడం లేదో అంతు చిక్కడం లేదు. కార్పొరేషన్‌లో పార్క్ నిర్మాణం పేరిట పెద్ద మొత్తంలో నిధులు దుబారా జరిగినా ఇక్కడ అడిగేవాళ్లు...నిలదీసేవాళ్లు...లేకపోవడంతో కనీసం ప్రశ్నించే వాళ్లు కూడా పాలక పక్షంలో కరువయ్యారన్న విమర్శలు గుప్తుమంటున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ విషయంపై కార్పొరేషన్ ఇంజనీర్ మల్లిఖార్జున్‌ను వివరణ కోరగా..గతంలో జరిగిన పార్క్ పనుల విషయంపై నాకు తెలియదని, సమాచారం లేదని, ప్రస్తుతం అమృత పథకంలో భాగంగా కోటి రూపాయలతో పార్క్ నిర్మాణానికి పనులు చేపట్టేందుకు ప్రతిపాథనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.