కరీంనగర్

చిన ముల్కనూర్ రాష్ట్రానికే ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, ఏప్రిల్ 28: అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను విధిగా అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం సిఎం కెసిఆర్ దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన ముల్కనూర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మహిళ సంఘం కార్యాలయం భవనానికి శంకుస్థాపనతో పాటు రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ చిన ముల్కనూర్‌లో సుమారు 15.54 కోట్ల రూపాయల వ్యయంతో 247 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించబోతున్నామన్నారు. ఇండ్ల నిర్మాణాలను మెగా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించామని చెప్పారు. దాదాపు 20 మంది ఇంజనీర్లు, 300 మంది సిబ్బందితో ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా 3నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. చిన ముల్కనూర్ గ్రామస్థులందరూ ఐకమత్యంతో ఉండి, గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామంలో రోడ్లు వెడల్పు యజ్ఞంలా చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామానికి ఇప్పటికే 60 కోట్లు మంజూరు చేశామన్నారు. మరో 1.30 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా గ్రామంలో 2.83 కోట్ల వ్యయంతో బి.టి రోడ్లు నిర్మిస్తామన్నారు. సుమారు 21 కోట్లతో ముల్కనూర్-కోహెడ డబుల్ రోడ్డు నిర్మాణా పనులు నడుస్తున్నాయని మంత్రి ఈటల చెప్పారు. 1.25 కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, 60 లక్షలతో మహిళ సంఘం భవన నిర్మాణం, 1.40 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణం, 40 లక్షలతో ట్రైనింగ్ సెంటర్ మొత్తంగా 26.22 కోట్లు మంజూరు చేశామని ఆయన వివరించారు. అలాగే 20.4 కోట్లతో మూడు చెరువులను మిషన్ కాకతీయ కింద మంజూరు చేశామన్నారు. ఇక చిన ముల్కనూర్ జిల్లాకే కాదు రాష్ట్రానికే ఆదర్శం కావాలన్నారు. గ్రామాభివృద్ధి కమిటీలో చర్చించి అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్, జడ్పీటిసి వీరమల్ల చంద్రయ్య, సర్పంచ్ మకుటం రాజయ్య, ఎంపిటిసి ముప్పిడి సంగీత-దేవేందర్‌రెడ్డి, ఆర్‌డివో చంద్రశేఖర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సతీష్, తహశీల్దార్ రాజు, ఎంపిడివో శ్రీనివాసస్వామి పాల్గొన్నారు.
మంత్రి ఎదుట గలాటా
చిన ముల్కనూర్‌లో డబుల్‌బెడ్ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజకు హాజరైన మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ఎదుట మంజూరైన ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ కొంతమంది కాసేపు గలాటా సృష్టించారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. ఈటల మొదటగా గలాటా చేస్తున్న గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు వినకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన వినరా.. సిఎం అడక్కుండానే మీ గ్రామాన్ని దత్తత తీసుకొని ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కాస్తంత ఓపిక లేదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఐకమత్యంగా ఉండి, గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలని హితవు పలికారు. రాని వారికి ఇళ్ల వస్తాయ్.. అర్హులైన వారికి ఖచ్చితంగా వస్తాయ్ ఇలా గలాటా చేస్తే ఇళ్లు వస్తాయా? అని మండిపడ్డారు. అర్హులైన వారికి సర్వే చేసి ఇళ్లు లేనివారికి కేటాయించాలని గ్రామ ప్రత్యేక అధికారి, ఆర్‌డివోను మంత్రి ఆదేశించారు. దీంతో పోలీసులు గలాటా చేస్తున్న వారిని తీసుకెళ్లారు.