కరీంనగర్

ముల్కనూరు సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఏప్రిల్ 29: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్‌ను తీర్చిదిద్దిన సహకార గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ మారుపాటి లక్ష్మారెడ్డి (65) అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు అందించినప్పటికీ ఆయన మృతి చెందారు. సుమారు మూడు దశాబ్ధాల పాటు ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకులోని రైతులకు ఆయన విశిష్ట సేవలు అందించారు. రైతుల బాగుకోసమే ఆయన అహర్నిశలు వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి పాటుపడ్డారు. రైతుల అభివృద్ధితో పాటు సహకార గ్రామీణ బ్యాంక్‌ను వ్యాపారరంగంలో 200 కోట్లకు పైగా టర్నోవర్ చేయించారు. ప్రతీ సంవత్సరం రైతులకు బోనస్ రూపంలో ఏడు వేల కుటుంబాలకు చెందిన రైతులకు కోట్లాది రూపాయలు అందించడంలో విజయవంతంగా పనిచేశారు. హైదరాబాద్‌లో మృతి చెందిన ఆయన మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం ముల్కనూర్ బ్యాంకులో రైతుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచారు. శనివారం ఉదయం ఆయన స్వస్థలం భీమదేవరపల్లిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. జనరల్ మేనేజర్ లక్ష్మారెడ్డి మృతి పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూర్ బ్యాంక్ అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పత్తిపాక కొమురెల్లి, కొత్తకొండ దేవస్థానం చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర గుప్త, ముల్కనూర్ మాజీ సర్పంచ్ మంగ రాంచంద్రం, ముల్కనూర్ ఉపసర్పంచ్ కొలుగూరి రాజు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.