కరీంనగర్

సమాజంలో నిజాయితీదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, అక్టోబర్ 11: సమాజంలో ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు నీతి గెలిచి రాక్షససత్వం ఓడుతుందని టిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర ఎంపిపి దూలం బాలాగౌడ్‌పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గంగాధర ఎంపిపిగా పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న దూలం బాలాగౌడ్‌పై కొందరు కుట్రలు చేసి అవిశ్వాసం పెట్టడం, ఆ అవిశ్వాసం వీగిపోవడం, నిజాయితీకి నిలువుటద్ధంగా నిలిచిందన్నారు. అలాగే తన స్వగ్రామం నారాయణపూర్ గ్రామంలో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడుతూ గతంలో అనేకసార్లు స్థానికేతరులకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి స్థానికులకే అవకాశం వస్తుందని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఒక కుటుంబ సభ్యునిగా పనిచేస్తున్న తనకు పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే గతంలో కన్నా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దూలం బాలాగౌడ్, జడ్పీటీసీ ఆకుల శ్రీలత-మధుసూధన్, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు పులుకం గంగన్న, మాజీ జడ్పీటీసీ సత్తు కనుకయ్య, మాజీ ఎంపిపి గంగాధర శంకర్, ఎంపిటిసిలు కరబూజ సూర్యమ్మ, రావుల లక్ష్మణ్ గౌడ్, ముద్దం జమున, న్యాతరి పద్మ, కరబూజ తిరుపతి గౌడ్, వైద రామానుజం, కర్ర బాపురెడ్డి, వంగల పరందాములు, భూమాగౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజలు కేసీఆర్‌ను నమ్మరు
- కాంగ్రెస్ నేత దుద్దిళ్ల ధ్వజం
కమాన్‌పూర్, అక్టోబర్ 11: టిఆర్‌ఎస్ పార్టీకి ఓటేసి ప్రజలు మోసపోవద్దని టిపిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు అన్నారు. కమాన్‌పూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ చాతగాని తనానికి అసెంబ్లీ రద్దు నిదర్శమని పేర్కొన్నారు. పరిపాలన చేతగాకనే 9 నెలల ముందు అసెంబ్లీ రద్దు చేశారని పేర్కొన్నారు. ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకే వస్తున్నారని, ఈ సారి తెలంగాణ ప్రజలు కెసి ఆర్‌ను నమ్మరని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుందని చెప్పారు. అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ అని, తాను మంత్రిగా ఉన్న సమయంలో కమాన్‌పూర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెంటినరీకాలనీలో జెఎన్‌టియు కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రం, గుండారంలో 33కెవి సబ్ స్టేషన్‌తోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పన సన్నబియ్యం, మహిళా గ్రూప్‌లకు లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దపల్లి నుంచి మంథనికి వెళ్లే ప్రధాన రహాదారి పూర్తిగా గుంతలమయంగా మారిందని, అక్రమంగా ఇసుక రవాణా అవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. ఈ సభలో ముత్తారం జడ్పిటిసి చొప్పరి సదానందం, నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, రంగు సత్యం, సుతారి రాజేందర్, బొల్లంపల్లి తిరుపతి గౌడ్, గాండ్ల మోహన్, వైనాల రాజు, తోట చంద్రయ్య, సయ్యద్ ఇక్బాల్ పాల్గొన్నారు.