కరీంనగర్

ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 12:ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, పరిశ్రమల శాఖల్లో అప్రెంటిస్‌షిప్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా అప్రింటిస్‌షిప్ కమిటీ సభ్యులతో కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఓ 37ప్రకారం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ కమిటీ సూచనల మేరకు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులంతా ఆన్‌లైన్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అభ్యర్థులు తమ అర్హత మేరకు అప్రెంటిసిషిప్‌లో చేరాలన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఆయా ఐటీఐ కళాశాలలో ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అప్రెంటిస్ కమిటీ కన్వీనర్, కరీంనగర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. సత్తయ్య, కమిటీ సభ్యులు ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, ఎన్‌సీడీసీఎల్‌ఎస్‌ఈ మాధవరావు,అసిస్టెంట్ కమీషనర్ కార్మిక శాఖ కోటేశ్వర్, డీసీటీఓ కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.