కరీంనగర్

ప్రజాస్వామ్యానికి పట్టం కట్టేందుకే టీడీపీతో జత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చివరి క్షణం వరకు ప్రజాసేవలోనే ఉంటా
* ఆరోపణలపై వున్న శ్రద్ద అబివృద్దిపై చూపిస్తె బాగుండేది
* ప్లైయింగ్ విజిట్స్ తప్ప అబివృద్ది చేసిందేది
* సాంకేతిక విశ్వవిద్యాలయంగా జెఎన్‌టియు
* సీఎల్పీ తాజామాజీ ఉపనేత జీవన్‌రెడ్డి
=============================================
జగిత్యాల, అక్టోబర్ 12: రాష్ట్రానికి దాపురించిన నిరంకుశ పాలనను అంతమొందించడానికి ప్రతిపక్షాలు కలిసి కట్టుగా జతకూడితే టిఆర్‌ఎస్ పార్టీలో వణుకు పుడుతుందని సీఎల్పీ తాజామాజీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పట్టం కట్టెందుకే టిడిపితో జతకట్టామని జీవన్‌రెడ్డి తెలిపారు. ఆనాడు మీరుపొత్తుకుంటే తప్పులేదు కాని తాము పొత్తుపెట్టుకుంటే అపవిత్రకలయిక అని నెత్తినోరు కొట్టుకుంటున్న టిఆర్‌ఎస్ నాయకులు తాము చేస్తేసంసారం మందిచేస్తె వ్యభిచారంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ కూతురు కవిత జగిత్యాల నియోజకవర్గంలో నాలుగేళ్ళలో 40సార్లు పర్యటించడమే తప్పా ఎక్కడ అబివృద్ది చేసిందిలేదని విమర్శించారు. జగిత్యాల మున్సిపల్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఎంపి కవిత తన అన్న మున్సిపల్ శాఖమంత్రిగా ఉన్నకెటిఆర్‌తో విచారణ జరిపించుకోవచ్చునని అన్నారు.అసంబద్ద ఆరోపణలే చేయడమే పనిగా పెట్టుకున్న కవిత అబివృద్దిపై చూపిస్తె నిజమాబాద్ లోక్‌సభ భాగుపడేదని అన్నారు. నాలుగేళ్ళుగా ఎంపిగావున్న కవిత జగిత్యాలలో కనీసం రైల్వే భారికేడ్ తొలగించడంలో విఫలమయ్యారన్నారు. సిరిసిల్ల మున్సిపాలీటిలో పర్సెంటిజీలు తీసుకుంటున్నది వాస్తవమేనని చైర్‌పర్సన్ ఒప్పుకుంటే అక్కడ ఎమ్మెల్యేగా వున్న మీఅన్న మున్సిపల్ శాఖమంత్రిగా వుండి ఏమిచర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. తన ఎన్నికల అఫిడవిట్లను సేకరించి ఆరోపణలు చేస్తున్న కవితతో ఎలాంటి బహిరంగా విచారణకైన సిద్దమేనని ప్రకటించారు. 60్ఫట్ల యావర్‌రోడ్డువిస్తరణను 100్ఫట్లకు పెంచేందుకు ఫైల్‌ను బల్ధీయా మున్సిపల్‌శాఖకు పంపిస్తె జీవన్‌రెడ్డికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని తొక్కిపెట్టింది నీసోదరుడుకాదా అని విమర్శించారు. జగిత్యాలలో 4వేలు ఇళ్ళు మంజూరును ప్రకటించి ఒక ఇళ్ళు కూడా కట్టకుండా వదిలేసిన మీరు నిర్మాణాలను గాలికొదిలేసారనిఅన్నారు.టిటీడీపీ రాష్టఅద్యక్షుడు ఎల్ రమణ,తాను జగిత్యాల గడ్డపై పుట్టామని రాజకీయ స్వార్థం కోసమో, పదవులకోసమే అరువువచ్చిన వాళ్ళం కాదని ఇక్కడే పుట్టాము, ఇక్కడే గిట్టేవాళ్ళమేనని అన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గోని మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు రెండురోజులు జైల్లోగడిపామన్నారు. అవగాహన రాహిత్యంతో ఎంపికవిత అరోపణలు చేయడం ఆమె రాజకీయ అవివేకానికి నిదర్శనమన్నారు. తాను, తన కుటుంబంపై ఆరోపించిన అంశాలన్నింటిపై విచారణ జరిపించుకోవాలని ఎంపి కవితకు సూచించారు. తాను మంత్రిగా వున్నప్పుడు శాతవాహన విశ్వవిద్యాలయం, జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలను వైఎస్‌ను ఒప్పించి తీసుకవచ్చానని అన్నారు.మూడున్నర దశాభ్ధాల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమేనని అన్నారు. ఈసమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మిదేవెందర్‌రెడ్డి, బండశంకర్, ముస్కుఎల్లారెడ్డి, మన్సూర్, గర్వంద నరేష్‌గౌడ్, పులి రాము, పుప్పాల అశోక్ తదితరులు పాల్గోన్నారు.