కరీంనగర్

తెలంగాణలో పథకాల కొనసాగింపుకు.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గడీలు అమ్మాడా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కళ్లుండి చూడలేని కబోదులు కల్వకుంట్ల కుటుంబం
* సబ్బండ వర్గాలను మోసం చేసిన టీఆర్‌ఎస్
* బీరు, బిర్యానీలు పంచితేనే సభ సక్సెసైనట్లా..?
* కేటీఆర్ అహంకార వ్యాఖ్యలపై ప్రజాగ్రహం
* మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్నదీ టీఆరెస్సే !
* బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
====================================
కరీంనగర్, అక్టోబర్ 12: తెలంగాణకు నిధుల మంజూరీకై ప్రధాని మోదీ తన ఇంటి వెనుక పొలం అమ్మలేదు..కానీ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సీఎం కేసీఆర్ తన గడీలను ఏమైనా అమ్మకానికి పెట్టారా..? అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కళ్ళుండి చూడలేని కబోదులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అని విమర్శించారు. అమిత్‌షా సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి టీఆర్‌ఎస్‌పై సమరభేరి మోగిస్తే, అసలు జనాలే రాలేదంటూ ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. మీలా బీర్లు, బిర్యానీలు పంచితే సభకు రాలేదని ఎద్దేవా చేశారు. బీజీపీ ప్రభుత్వం కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు స్వచ్చంధంగా తరలివచ్చారని అన్నారు. అమిత్‌షా ప్రసంగంతో తెరాస నేతల గుండెల్లో గుబులు మొదలైందని, తమ ఓటమి ఖాయమనే నిర్ణయానికి వచ్చి అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. మతోన్మాదం పేర మరోసారి ఎంఐఎంతో అంటకాగేందుకు యత్నిస్తూ బీజేపీపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన ఎంఐఎంతో స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానంటూ, రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న మాటలు నీటిమూటలుగా మార్చేసాడన్నారు. పూటకోమాట, గడియకో ప్రకటన చేయటం బీజేపీ తత్వం కాదని, నిబద్దత, నిజాయితీతో దేశంలో సుపరిపాలన అందిస్తుందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 2014నుంచి మొన్నటి కర్నాటక ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే విజయకేతనం ఎగరేసిందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం లేదంటూ ఓ వైపు ప్రజలు స్పష్టంగా పేర్కొంటుండగా తండ్రీ, కొడుకులకు దిమ్మతిరిగి పోతుందన్నారు. అహంకార పూరిత వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రజాగ్రహం పెల్లుబికుతున్నా, గ్రహించకపోవటం సిగ్గు చేటన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలువటం అసాధ్యమని గ్రహించి ఎస్సారెస్పీ నుంచి తన ఇలాఖాకు నీరు మళ్లించేందుకే, వరద కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపుతథ్యమన్నారు. ఈసమావేశంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గాజుల స్వప్న, ప్రధాన కార్యదర్శులు గుజ్జ సతీష్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, నాయకులు జానపట్ల స్వామి, మీస అర్జున్‌రావు, శ్రీనాథ్‌రెడ్డి, జేరుపోతున్న శంకర్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.