కరీంనగర్

త్యాగాల తెలంగాణను తాకట్టు పెడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, అక్టోబర్ 12 : ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణను అటు అమరావతికి ఇటు ఢిల్లీకి తాకట్టుపెట్టే యత్నాలు మహాకూటమి చేస్తోందని, ఎన్నికల్లో కూటమి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించి సమావేశాలు ఏర్పాటు చేసారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు టి ఆర్ ఎస్‌లో చేరగా వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో టి ఆర్ ఎస్, పార్టీ, కె సి ఆర్ కృషిని ఎవరూ మరువలేరని అన్నారు. టి ఆర్ ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించి అధికారం ఇచ్చారని, దాన్ని సీ ఎం కె సి ఆర్ సద్వినియోగం చేసుకుని ప్రజలకు అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. తెలంగాణ అభివృద్ది, సంక్షేమం మరింత సుస్థిరతతో జరగాలనే ముందస్తుకు వెళ్లారని, మొదట ముందస్తుకు రెడీ అన్న ప్రతిపక్షాలు ఇప్పుడు తెల్లమొఖం వేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలు వద్దంటూ కోర్టు మెట్లు ఎక్కారని, ఒక వైపు ప్రజలు తిరస్కరిస్తుంటే, గ్రామాలకు గ్రామాలు గులాబీ మయం అవుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ టి ఆర్ ఎస్ పార్టీపై బుదరజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు తెలంగాణ భవిష్యత్తుపై ఒక స్పష్టతలేదని, వారికి అభివృద్ది, సంక్షేమం అంటే గిట్టదని, వారికంటూ ఒక అభిప్రాయం లేదని, అధిష్టానాలకు బానిసలని, అభివృద్దిని ఓర్వలేరని, ప్రజలు అభివృద్ది కావద్దన్నదే వారి అభిమతమని ఈటల దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి ఏనాడు విద్యుత్తు, ప్రజాసంక్షేమ పథకాలు వంటివి ఏనాడు గుర్తుకు రాలేదని, మరోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మహా కూటమికి కర్రు కాల్చి వాతపెడుతారని పేర్కొన్నారు. గడచిన 50 ఏళ్లలో జరగని అభివృద్ది కేవలం నాలుగేళ్లలో హుజూరాబాద్‌లో చేసి చూపించామని, రాబోయే కాలంలో హుజూరాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దే బాధ్యత నాదని మంత్రి అన్నారు. తమకు గెలుపుపై విశ్వాసం, నమ్మకం ఉన్నాయని టి ఆర్ ఎస్ వందకు పైగా సీట్లు గెలవబోతోందని ఈటల జోస్యం చెప్పారు. సిర్సపల్లి గ్రామానికి చెందిన కల్లెపు హనుమంతరావు, సంపత్‌రావు, దేవేందర్, యాదవ సంఘం నాయకులు చిరంజీవి, తిరుపతి, బక్కయ్య, పద్మశాలి సంఘం నాయకులు దొంత వెంకటయ్య, శ్రీనివాస్, ఎల్లయ్య, మాసాడి రమేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు ఆనందం, ఆగయ్య, మహిళా నాయకులు గంగా, శోభ, సరిత, వెంకట్రావ్‌పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనె్నవేన జంపయ్య, టిడిపి నాయకులు ఆవుల రాజయ్య, కంకణాల సదానందంలతో పాటు ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన కాంగ్రెస్, టిడిపి అధ్యక్షులు సదానందం, మల్లేశం లతో పాటు యూత్ సభ్యులు టి ఆర్ ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

ఏడాది గడుస్తున్నా ఎదురుచూపులే

ఆన్‌లైన్ లోపాలు..రైతన్నకు శాపాలు ౄఅన్నదాతకు దక్కని భూప్రక్షాళన ఫలాలు
చెక్కులు అందలే..పాసు బుక్కులు రాలే ౄరైతు బీమా ఊసే లేదు

కరీంనగర్, అక్టోబర్ 12: ఆన్‌లైన్ లోపాలు అన్నదాతల పట్ల శాపాలుగా మారాయి. ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు లోపాల సవరణ ఉండటంతోఎదురుచూపులే తప్ప, వారికి ఒనగూరిందేమి లేదనే విమర్శలు వస్తున్నాయి. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోగా, ఇప్పటికీ అనేక మంది రైతులకు చెక్కులు అందక, పాసుబుక్కులు రాక భూ ప్రక్షాళన ఫలాలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. దీంతోమొదటి విడతకే మోక్షం లేదు..ఇక రెండోవిడత మాకు దక్కేదెక్కడ అంటూ ఆశలొదులుకుంటున్నారు. తరాల తరబడి నెలకొన్న భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఎంతోప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది నవంబర్ 15న ఈపథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, వందరోజుల్లో సమస్యలు పరిష్కరించి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు, ఆన్‌లైన్ చేయాలంటూ ఆదేశించింది. నిర్దేశించిన గడువులోపు పూర్తికాకపోగా, పలుమార్లు పొడిగించినా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయలేకపోయారు. ఫలితంగా వేల సంఖ్యలోరైతులకు ఇప్పటికీ పాసుబుక్కులందక, దిగులు పడుతున్నారు. అనాదిగా భూవివాదాలతో బాధపడుతున్న రైతుల శ్రేయస్సు కోరి ఆరంభించిన ఈపథకం రెవెన్యూ యంత్రాంగానికి కామధేనువుగా మారగా, కొత్తసమస్యలు పుట్టుకొచ్చాయి. వీటిని ఎక్కడికక్కడే పరిష్కరిస్తూ, ధరణి వెబ్‌సైట్ లో నమోదు చేయాల్సి ఉంది. అయితే, కొంతమంది రెవెన్యూ సిబ్బంది చేసిన నిర్వాకంతోతప్పుల తడకలతో ఆన్‌లైన్ చేశారు. వీటిని సరిచేయటంలోనెలకొన్న జాప్యంతో రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి కూడా అనర్హులయ్యారు. కరీంనగర్ జిల్లాలో1.82 లక్షల మందికి పైగా రైతులుండగా, 1,46,027మందికి, సిరిసిల్లలో1.20లక్షల పైచిలుకు మందికి గాను 1,04,636 మందికి, జగిత్యాలలో2లక్షలకు పైగా ఉండగా, 1.68లక్షల మందికి, పెద్దపల్లి జిల్లాలో 1,27,733మంది రైతులకు మాత్రమే ఇప్పటివరకు పాసుబుక్కులందాయి. తప్పొప్పులు సరిచేయటం, పాసుబుక్కులందజేయటం నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం ప్రకటించినా, రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇందుకు భిన్నంగా పనిచేస్తుందనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది రైతుల సమస్యలు ఆన్‌లైన్ దాటి ధరణి వెబ్‌సైట్‌కు చేరుకోకపోవటంతో, రెండోవిడత రైతుబంధు తమకు అందనంత దూరంలో ఉందనే ఆవేదన వారిలో నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆన్‌లైన్ లోపాలు సవరిస్తే, ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందే అవకాశాలుంటాయని రైతులు కోరుతున్నారు.