కరీంనగర్

మిన్నంటిన పూల జాతర సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ/వేములవాడ టౌన్, అ క్టోబర్ 14: సప్తవర్ణాలూ ఒకేచోట చేరినట్లు... సప్తస్వరాలూ ఒకే లయలో మోగుతున్నట్లు... అక్కడికి చేరిన వందలాది మహిళలను చూస్తే.. లోక ంలోని సంతోషమంతా ఒకేచోట తా ండవించినట్లు అనిపించకమానదు.. మూలవాగులో ఆదివారం మహిళల ంతా బతుకమ్మ వేడుక చేసుకున్నారు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ ద ృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిలువెత్తు బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు చూపరులకు కనువిందు చేశారు. ఏడురోజులుగా నిర్వహిస్తున్న పండుగ చివరిరోజు కావడంతో మొ త్తం వేములవాడ మహిళలంతా తరలివచ్చిన వేళ అది. రంగురంగుల బతుకమ్మలను మధ్యలోచేర్చి నారీమణులు చేయిచేయి కలపి నృత్యాలు, కోలాటాలు ఆడారు. పట్టణంలో సద్దుల బ తుకమ్మ వేడుకలు అత్యంత వైభవోపేతంగా ఘనంగా ముగిశాయి. జిల్లా అ ంతటా తొమ్మిదిరోజులు జరిగే సద్దుల బతుకమ్మ వేడుక వేములవాడలో మా త్రం ఏడురోజులకే జరగటం విశేషం. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉ దయం పూలు, పండ్లు అమ్మే కూరగాయల మార్కెట్ కిలోమీటర్ మేర విస్తరించింది. ప్రకృతిలో విరివిగా పూసే గుమ్మడి, గునుగు, చామంతి, పట్టుకు చ్చు పూలతో ఉదయం 10 గంటల నుంచే బతుకమ్మలను మహిళలు సృ జనాత్మకంగా సిబ్బిలో పేర్చారు. గుమ మడిపువ్వు కాండాన్ని, పసుపు ముద్దను చేసి గౌరిదేవికి ప్రతిరూపంగా పెట్టి అగర్‌బత్తీలను, ప్రమిదలను వెలిగించి మొట్టమొదట తమతమ ఇంటి గు మ్మాల ముందు బతుకమ్మలను పెట్టి మహిళలు బతుకమ్మను కొలిచారు. సాయంత్రం 6 గంటలకు మహిళలు పట్టుచీరలు, ఆభరణాలు ధరించి సమీపంలోని కూడళ్ల వద్దకు చేరుకొని సామూహికంగా బతుకమ్మలను పెట్టి వాటిచుట్టూ తిరుగుతూ, చప్పట్లను చ రుస్తూ పాటలు పాడుకుంటూ వేడుక చేసుకున్నారు. అనంతరం పసిడి కా ంతులమధ్య ఆరేడు గంటలకు మహిళలందరూ మూలవాగులోకి చేరుకొ ని, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏ ర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప, ఘాట్‌లలో బతుకమ్మలను నిమజ్జనం చేశా రు. రంగురంగుల విద్యుత్ దీపాలు, ఫ్లడ్‌లైట్ కాంతులమధ్య రాత్రి వరకు నిమజ్జన కార్యక్రమం సాగింది. నవధన్యాలను, పిండికి తీపిని చేర్చి పరస్ప రం పంచుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, నగర ప ంచాయితీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం, వైస్‌చైర్మన్, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ, నగర కాం గ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, తెరాస నాయకులు పొలాస నరేందర్, ఎర్రం మహేశ్, సెస్ డైరెక్టర్లు రామతీర్థపురాజు, జడల శ్రీనివాస్, టి డిపి నాయకులు దివాకర్‌రావు, పులిరా ంబాబు, సాయితేజ, సుదర్శన్‌యాద వ్, తెరాస నాయకులు ప్రసాదరావు, భాస్కర్‌రావు, ఎర్రం మహేశ్, ముకాస నాయకులు నామాల పోశెట్టి, సగ్గు ప ద్మదేవరాజు, చిలుక రమేశ్, మాల మహానాడు యువజన విభాగం నా యకులు పిట్టల సతీశ్, నాయకులు ఎ ర్ర శ్రావణ్, కనికరపు రాకేశ్, పల్లకొం డ అమర్, పొతుగంటి వెంకన్న తదితరులు పాల్గోన్నారు.
సంస్కృతి, సాంప్రదాయం
ఉట్టిపడేలా కట్టుబొట్టు
సద్దుల బతుకమ్మ సందర్భంగా మ హిళలు సాంప్రదాయం ఉట్టిపడేలా పట్టుచీరలు, యువతులు లంగా వో ణీలు ధరించి సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేరీతిలో కట్టుబొట్టు ధరించి ఆకట్టుకున్నారు. మూలవాగు లో ఆదివారం జరిగిన సద్దుల బతుక మ్మ నిమజ్జనం సందర్భంగా మహిళ లు ఆభరణాలు, ముంజేతి వరకు గా జులు ధరించి మూలవాగులో కోలాటాలు ఆడారు.
కిక్కిరిసిన రాజన్న ఆలయం
బతుకమ్మలను మూలవాగులో ని మజ్జనం చేసిన అనంతరం మహిళల ందరూ తమ పిల్లాపాపలతో కలసి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి చే రుకున్నారు. ఆదివారం స్కందమాత అలంకారంలో అమ్మవారిని దర్శించుకొని తమ పసుపుకుంకుమలను చల్ల ంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణ లో మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
సద్దుల బతుకమ్మ వేడుకలను ఘ నంగా నిర్వహించడానికి నగర పంచాయితీ పాలకవర్గం, అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు. బతుకమ్మలను ఆడే మూలవాగులో 150డే లె ట్లను, 100హైమాస్‌లైట్ల ఏర్పాట్లు చేశా రు. పట్టణంలోని 20 వార్డులలో మరో 100 హైమాస్ లైట్లను సైతం ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా భ క్తుల దాహార్తి తీర్చడానికి 10 వేల వాటర్‌ప్యాకెట్లను అందుబాటులో ఉం చారు.