కరీంనగర్

డా. కందేపి రాణీప్రసాద్‌కు.. తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 14: సిరిసిల్లకు చెందిన రచయిత్రి, కవయిత్రి, బాల సాహితీవేత్త డా. కందేపి రాణీప్రసాద్ కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వివరాలను ఉపకులపతి ఆచా ర్య ఎస్వీ సత్యనారాయణ, విస్తరణ సే వా విభాగం అధికారి రింగు రామూ మర్తి విడుదల చేసిన ప్రకటనలో తెలిపా రు. గత మూడు దాశాబ్దాలుగా బాల సాహిత్యం రాస్తున్న మానేరు రచయితల సంఘం ఉపాధ్యక్షులు డా. రాణీప్రసాద్‌కు ఈ పురస్కారం రావడం అ భినందనీయమని మారసం పేర్కొం ది. బాల సాహితీవేత్తగా, హస్తకళాకారిణిగా, సైన్స్ రచయిత్రిగా రాణీప్రసా ద్ ప్రసిద్దులు, ఆసుపత్రి వ్యర్థాలకు కళాకృతులుగా జీవం పోస్తున్న వీరు బాల సాహిత్యం, బొమ్మల తయారీ, అనువాదాలు, సైన్స్ రచనలు, సంపాదకత్వంతో కలిపి 25 వరకు వివిధ ర చనలు చేశారు. ఈనెల చివరన హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమం లో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ. 5,116లు నగ దు, ప్రశంసాపత్రం అందచేసి సత్కరిస్తారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి పురస్కా రం, చింతోజు బ్రహ్మయ్య సాహిత్య పురస్కారం, వండర్ బుక్‌ఆఫ్ రికార్డు వంటివి రాణీప్రసాద్ అందుకున్నారు. రాణీప్రసాద్‌కు ఈ పురస్కారం రావడ ం పట్ల మానేరు రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డా. పత్తిపాక మోహన్, ప్రధాన కార్యదర్శి ఎలగొం డ రవి, కార్యనిర్వాహక అధ్యక్షులు గ రిపల్లి అశోక్, టివి.నారాయణ, అల్లె శ ంకర్, తిరుమల జగన్నాధాచార్య, తదితరులు అభినందనలు తెలిపారు.