కరీంనగర్

గెలుపుకంటే అభివృద్ధే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 15: ఇందిరమ్మ రాజ్యంతోనే దళితులు, బలహీన వర్గాలు, అల్ప సంఖ్యాక వర్గాల్లో ఆత్మస్దైర్యం నెలకొంటుందని ఇందిరమ్మ రాజ్యం పున స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగిత్యాల తాజామాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జెడ్‌పిటిసి సభ్యురాలు పెండెం నాగలక్ష్మి రాములు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థను టీఆర్‌ఎస్ చిన్నాభిన్నం చేసిందని గ్రామాల్లో పాలన లేకుండా పోయిందని ఒక కార్యదర్శి 5,6 గ్రామాలకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. స్ధానిక సంస్థల్లో పాలన లేకుండా పోయిందని, రాష్ట్రం నుండి ఒక్క రూపాయి విడుదల కాలేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి ఏనాడు కృషి చేయలేదన్నారు. రాజీవ్‌గాంధి ప్రవేశపెట్టిన ఉఫాది హామీ పథకంతోనే గ్రామ పంచాయితీల్లో ఇంకుడుగుంతలు,సిసి రోడ్లు, వైకుంఠదామాలు, గ్రామ పంచాయితీ భవనాలు కూడ నిర్మాణం జరుగుతున్నాయన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమీషన్ కనుమరుగైందని,వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గ్రామ పంచాయితీ ఎన్నికల వాయిదా మార్గాలను టీఆర్‌ఎస్ ఎంచుకుంద న్నారు. రాజీవ్‌గాంధీ స్దానిక సంస్ధలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహణ, 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా నిధులు కేంద్రం నుండి నిధులు గ్రామాలకు అందింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు - మన ప్రణాళిక ప్రవేశపెట్టి నిధులు కేటాయించలేదని, గ్రామీణ జ్యోతిని ప్రవేశపెట్టి జ్యోతి వెలగకుండానే ఆరిపోయిందని ఎద్దేవా చేశారు. గెలుపే ప్రదానం కాదని గ్రామీణ ప్రాంత అభివృద్దే లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌పార్టీలో చేరిన జెడ్‌పిటిసి పెండెం నాగలక్ష్మిరాములు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ది జరుగుతుందని ఆశించి వెళితె అభివృద్ది ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. మళ్లి నా పుట్టిల్లైన కాంగ్రెస్ పార్టీకి వచ్చానని జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలుపించుకుతీరుతామని అన్నారు.