కరీంనగర్

ఉమక్క.. దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 15: తుల ఉమ..తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నేతగా, మహిళా ప్రజాప్రతినిధిగా ఈ పేరు తెలియని వారుండరు. భూస్వామ్య, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిన్నటిదాక పోరాడి తనకంటూ ‘ప్రత్యేక’ గుర్తింపు తెచ్చుకున్న మహిళా నాయకురాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానంతరం ఆ పార్టీ అధినేతతో కలిసి మలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరు సలిపి, కేసీఆర్ తలలో నాలికలా మారింది. కొత్త రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచి, మొట్టమొదటి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై రికార్డును సొంతం చేసుకుంది. తాను చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తన మండల పరిధిలోకి వచ్చే వేములవాడ నియోజక వర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. ఇంతటి చరిత్ర కలిగిన ఆ నాయకురాలు ప్రస్తుతం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. శాసనసభా ఎన్నికల్లో తాను పోటీ చేయనని, అధిష్టానం మాటే శిరోధార్యమని స్పష్టం చేస్తున్నా అభిమానులు మాత్రం రాబోయే ఎన్నికల్లో ఉమక్కే తమకు ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ పార్టీలకు అతీతంగా కోడై కూస్తున్నారు. ఆదిలో అధిష్టానం సైతం ఒకింత మొగ్గుచూపినట్లు కనిపించింది. అయితే అసెంబ్లీ రద్దు, తెరాస అభ్యర్థుల ప్రకటన చకచకా జరిగిపోగా, వేములవాడ నుంచి ఉమక్కకు టిక్కెట్ రాకపోవటం పార్టీ కార్యకర్తలు, ఆ ప్రాంత వాసుల్లో నిరాశ, నిస్ఫృహలు అలుముకున్నాయి. పలు చోట్ల ఆందోళనలు సైతం నిత్యం జరుగుతుండగా, అధిష్టానం బుజ్జగించినా అభిమానులు ససేమిరా అంటున్నారు. దీంతో అభ్యర్థిని మార్చే అంశంపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుండగా, ఒకవేళ మార్చినా టిక్కెట్ ఖరారు చేసేనా..? అనే సంశయాన్ని ఉమక్క అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న కార్యకర్తలు టిక్కెట్ రాని పక్షంలో స్వతంత్రంగానైనా బరిలో నిలవాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అటు అధిష్టానం మాట కాదనలేక, ఇటు అభిమానుల అభిప్రాయాలను తోసిపుచ్చలేక పోతుందనే ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, నోటిఫికేషన్ విడుదల నాటికి సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఉమక్క అంతరంగీకుల ద్వారా తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయక పోతే మాత్రం స్వచ్చంధంగా పని చేయాలనుకున్న ఆమె అభిమానులు, చెల్లాచదురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా, తుది నిర్ణయం కోసం పార్టీ క్యాడర్ నిరీక్షిస్తుండటం గమనార్హం.