కరీంనగర్

పీసీసీ అధికార ప్రతినిధిగా గుగ్గిల్ల జయశ్రీ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 15: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు గుగ్గిల్ల జయశ్రీ నియమితులయ్యారు. ఈమేరకు పిసిసి ఉపాధ్యక్షుడు, మీడియా ఇంచార్జి డా.మల్లు రవి సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై నమ్మకంతోఅప్పగించిన రాష్ట్ర బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి, రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పునర్వైభవానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పొన్నం ప్రభాకర్‌కు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కృతజ్ఞతలు చెప్పారు. జయశ్రీ నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఆపరేషన్ చేసిన మహిళ కడుపులో పైపు
-జగిత్యాల ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
జగిత్యాల, అక్టోబర్ 15: కడుపునొప్పి ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళ కడుపులో నిర్లక్ష్యంగా పైపును వదిలేసి కుట్లు వేసిన సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట బైటాయించి దర్నా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ లోని ఒ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహకులు రాయికల్ మండలంలోని కొత్తపేటకు చెందిన మహిళకు కడుపునొప్పి ఆపరేషన్ చేసి గత కొన్ని రోజులు క్రితం డిశ్చార్జ్ చేశారు. అపరేషన్ చేసిన కడుపునొప్పి తగ్గకపోవడంతో సోమవారం జగిత్యాలలోని డయాగ్నసిస్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించుకున్నారు. కడుపులో పైపుఉందని రిపోర్ట్ రావడంతో ఆపరేషన్ చేసినా ఆసుపత్రి ముందు బైటాయించి దర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బాదితులను ఠాణాకు తీసుకొని వెళ్లారు. బాధితులు ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు.