కరీంనగర్

ఓటమి భయంతోనే.. విషం కక్కుతున్న కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 15: ఓటమి భయంతోనే మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెరాసపై కాలకూట విషం కక్కుతున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగరంలో భారీగా గులాబీ గూటి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన టీడీపీని, ఈ ప్రాంత ప్రజలు తరిమికొడితే మళ్ళీ తెలంగాణలో పాగా వేసేందుకు కూటమితో చేతులుకలిపి కాలకూట విషం చిమ్మేందుకు యత్నిస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు ఓటేస్తే పిల్లల భవిష్యత్తు అంథకారంగా మారే పరిస్థితి ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఏకం కావాలని, లేకపోతే ఆంధ్రపాలకుల చేతిల్లోకి వెళ్లే ప్రమాదముందన్నారు. నిధులు ఆంధ్రకు మళ్లించే అవకాశాలు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్రాపాలకులు జీర్ణించు కోలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే భారీగా తెరాసలో చేరుతున్నారన్నారు. భారీ చేరికలతో బంగారు తెలంగాణ సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.
ఈకార్యక్రమంలో కార్పోరేటర్లు రూప్‌సింగ్, కంసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా వాసవి మాత ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి గట్టు ఆనందం, సీఐటీయు నాయకులు, విజయపురి కాలనీ యువకులు భారీ చేరేందుకు రాగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. కొలిచే భక్తులకు కొంగుబంగారం నిలిచే అమ్మ దయ ఉంటే అన్నిట్లో విజయాలు వరిస్తాయని కరీంనగర్ తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారం, భారీ చేరికలు కార్యక్రమాలలో భాగంగా నగరంలో పర్యటించిన ఓటర్లను కలిసిన గంగుల స్ధానిక కాపువాడ బొమ్మకల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మదయ ఉంటే అన్నీ విజయాలే వరిస్తాయని వెల్లడిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో తలముకలయ్యారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు రూప్‌సింగ్, కంసాని శ్రీనివాస్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.