కరీంనగర్

జ్యేష్ట నక్షత్రంతోనే కేసీఆర్‌కు అథోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 16: జ్యోతిష్యాన్ని నమ్ముకొని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమావాస్య జ్యేష్ట నక్షత్రమే అథోగతి పాలు చేయబోతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం నగరంలో ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, మతంపేర వైషమ్యాలు రెచ్చగొట్టే దుస్థితి కాంగ్రెస్‌ది కాదని, గతంలో చేసిన అభివృద్ధి పనులే రాష్ట్రంలో తమ పార్టీని గెలిపిస్తాయన్నారు. తమ పార్టీ పాలనలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఏక కాలంలో లక్ష రూపాయల మాఫీ, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతోపాటు మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందజేశామని, ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన ఘనత కూడా తమ అధినేత్రి సోనియాగాంధీదేనన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం లో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్ తగుదునమ్మా.. అంటూ తానే ముఖ్యమంత్రి పీఠమెక్కాడని ఎద్దేవ చేశారు. కనీసం మంత్రి వర్గంలో కూడా దళితులకు, మహిళలకు చోటివ్వని నియంతంగా అభివర్ణించారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్య అటకెక్కిందని, ముస్లీంలు, గిరిజనుల 12శాతం రిజర్వేషన్లు హుళక్కి చేశాడని ఆరోపించారు. దళితులకు మూడేకరాల భూమి, డబుల్ బెడ్ రూంల ఇండ్లు, ప్రతి అసెంబ్లీకి లక్ష ఎకరాల సాగునీరు ఇంకెప్పుడు అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం తప్పనిసరి అంటూ ప్రగల్భాలు పలికి కనీసం ఊరికో ఉద్యోగం కూడా కల్పించలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని మండిపడ్డారు. కేసీఆర్ తనకు ఉద్యమ దిక్సూచీ అయిన కరీంనగర్ ప్రజానీకాన్ని మోసం చేశాడని, మెడికల్ కళాశాల, మానేరు రివర్ ఫ్రంట్, బృందావన్ గార్డెన్ ఏర్పాటు హామీలు గాలికొదిలి, నగరానికి మంజూరైన హర్టికల్చర్ వర్సిటీని గజ్జ్వేల్‌కు, లేదర్ పార్క్‌ను స్టేషన్‌గన్‌పూర్‌కు, సైనిక స్కూల్‌కు వరంగల్‌కు తరలించిన స్థానిక టీఆర్‌ఎస్ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఉద్యమానికి పునఃర్‌జన్మనిచ్చిన జిల్లా వాసులకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానని ఏడు ముక్కులు చేసి కరీంనగర్ చరిత్రను తిరగరాశాడని ధ్వజమెత్తారు. తమకు అవకాశం ఇస్తే అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పని చేస్తూ నిజాయితీ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి డిసెంబర్ 12న అధికారం చేపట్టబోతుందనే పొన్నం ధీమాను వ్యక్తం చేశారు.

జిల్లాలో 13మంది తహశీల్దార్ల బదిలీలు
కరీంనగర్, అక్టోబర్ 16: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోని బదిలీల్లో భాగంగా జిల్లాలోని 13మంది తహశీల్దార్లకు స్థాన చలనం చేస్తూ భూపరిపాలన ప్రధాన కమీషనర్ రాజేశ్వర్ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బదిలీ అయిన తహశీల్దార్లంతా రేపటిలోగా ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని తహశీల్దార్లు సిహెచ్ కోమల్‌రెడ్డి, డి. రాజయ్య, జి. సరిత, బి. రాజేశ్వరి, ఎన్. వెంకట్‌రెడ్డిలను జగిత్యాల జిల్లాలకు బదిలీ చేయగా, ఇదే జిల్లాలోని తహశీల్దార్లు జె. జయంత్, కె. రమేష్‌లను పెద్దపల్లి జిల్లాకు, టి. రవీందర్, సిహెచ్. శ్రీనివాస్‌లను ఆసిఫాబాద్ జిల్లాకు, సయ్యద్ ముబీన్ అహ్మద్‌ను మంచిర్యాల జిల్లాకు, జి. సదానందం, ఏ. జగతీసింగ్, భవన్‌సింగ్‌లను వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారితోపాటు స్థానికత కలిగిన జిల్లాకు చెందిన 13మంది తహశీల్దార్ల బదిలీకి అనుమతినివ్వాలని కోరుతూ రజత్‌కుమార్‌కు కోరుతూ సీసీఎల్‌ఏ రాజేశ్వర్ తివారీ బదిలీ ఫైల్‌ను పంపించగా పరిశీలించిన సీఈఓ బదిలీలకు ఒకే చెప్పారు. దీంతో తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. జిల్లా నుంచి 13మంది తహశీల్దార్లు బదిలీ కావడంతో కొత్త వారే విధుల్లో చేరనున్నారు. ఎన్నికల బదిలీల ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా రేపటిలోపు పూర్తి చేయాల్సి ఉండగా, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడేళ్ల పాటు ఒకే పోస్టులో ఉన్న అధికారుల బదిలీల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల బదిలీ చేసింది. ఇందులో భాగంగానే మిగిలిన అధికారుల బదిలీ ప్రక్రియను మొదలు పెట్టింది.